బ్రెడ్ కాజాలు | Bread kajalu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread kajalu recipe in Telugu,బ్రెడ్ కాజాలు, Indira Bhaskar
బ్రెడ్ కాజాలుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బ్రెడ్ కాజాలు వంటకం

బ్రెడ్ కాజాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread kajalu Recipe in Telugu )

  • బ్రెడ్ ముక్కలు 10
  • పంచదార ఒక కప్పు
  • ఇలాచి పౌడర్ పావు స్పూను
  • మిక్సిడ్ నట్స్ ఒక టేబుల్ స్పూన్
  • నూనె లేదా నెయ్యి వేయించడానికి సరిపడా

బ్రెడ్ కాజాలు | How to make Bread kajalu Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ ని అంచుల చివర కట్ చేసి మధ్యలోకి కట్ చేసి ఉంచుకోవాలి ‌.
  2. ఇప్పుడు వీటిని నెయ్యిలో చిన్నమంటమీద ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
  3. ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఇలాచి పౌడర్ కూడా వెయ్యాలి.
  4. దీనికి తీగపాకం రానక్కరలేదు.
  5. పైన వేయించుకున్న బ్రెడ్ ముక్కలు పాకంలో వేసి 1 నిమిషం పాటు ఉంచి తీసుకుని పైన మనకు నచ్చిన నట్స్, పళ్ళతో అలంకరించుకుంటే తియ్య తియ్యని బ్రెడ్ కాజాలు రెడీ.

నా చిట్కా:

మిల్క్ బ్రెడ్ అయితే పంచదార కొంచెం తగ్గించి , చూసుకుని వేసుకోవాలి.

Reviews for Bread kajalu Recipe in Telugu (0)