మిక్స్డ్ ఫ్రూట్ కేసరి | Mixed Fruit Kesari Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed Fruit Kesari recipe in Telugu,మిక్స్డ్ ఫ్రూట్ కేసరి, Tejaswi Yalamanchi
మిక్స్డ్ ఫ్రూట్ కేసరిby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

మిక్స్డ్ ఫ్రూట్ కేసరి వంటకం

మిక్స్డ్ ఫ్రూట్ కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed Fruit Kesari Recipe in Telugu )

  • ఉప్మా రవ్వ : 1 కప్పు
  • పాలు : 1 కప్పు
  • నీరు : 1 కప్పు
  • చక్కెర : 1 కప్పు
  • నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పులు : 20
  • ఎండు ద్రాక్ష / కిస్మిస్ : 20
  • యాలుకలు : 2
  • పండ్లు :
  • సేపు / ఆపిల్ చిన్నది 1
  • అనాస పండు : 2 ముక్కలు
  • మామిడి పండు : 1/2 కప్పు
  • దానిమ్మ సగం
  • బొప్పాయి 6 చిన్న ముక్కలు

మిక్స్డ్ ఫ్రూట్ కేసరి | How to make Mixed Fruit Kesari Recipe in Telugu

  1. ముందుగా ఫ్రూట్స్ అన్ని తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి
  2. పొయ్యిమీద బాండీ పెట్టి అది వేడి అయ్యాక ఒక చెంచా నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కనుంచుకోవాలి
  3. జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యిలోనే ముక్కలుగా చేసుకున్న ఫ్రూట్స్ ని రెండు నిమిషాలు వేయించుకోండి
  4. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు తీసుకొని దానికి ఒక కప్పు నీరు పోసి వేయించుకున్న ఫ్రూయిట్స్ వాటిలో వేసి ఒక నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి
  5. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసి ఒక కప్పు రవ్వ దాంట్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించాలి
  6. ఇప్పుడు పాలు కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసి కలుపుకోండి
  7. ఇప్పుడు పంచదార అది కరిగేదాకా కలుపుకోండి,దంచిన యలుకలు వేయండి కలపండి.
  8. రెండు చెంచాల నెయ్యి ,వేయించిన డ్రై ఫ్రూయిట్స్ వేసి మళ్ళీ బాగా కలుపుకొండి
  9. కలిపక బౌల్ లోకి తీసుకోండి
  10. అంతే మిక్స్డ్ ఫ్రూట్ కేసరి తయారు

Reviews for Mixed Fruit Kesari Recipe in Telugu (0)