కాజు బాదుషా | Kaju badhusha Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kaju badhusha recipe in Telugu,కాజు బాదుషా, Sree Vaishnavi
కాజు బాదుషాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

కాజు బాదుషా వంటకం

కాజు బాదుషా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju badhusha Recipe in Telugu )

  • మైదాపిండి: అరకిలో
  • కరిగించిన వెన్న: 150 గ్రా
  • పెరుగు: రెండున్నర టేబుల్‌స్పూన్లు
  • వంటసోడా: అరటీస్పూను
  • మంచినీళ్లు: తగినన్ని
  • ఉప్పు: చిటికెడు
  • పాకంకోసం: పంచదార: 200గ్రా.
  • మంచినీళ్లు: తగినన్ని
  • యాలకులపొడి: టీస్పూను
  • నిమ్మరసం: టీస్పూను
  • జీడిపప్పు 3-4
  • జీడిపప్పు పొడి 2-3 చెంచాలు
  • నూనె వేయించటానికి సరిపడా

కాజు బాదుషా | How to make Kaju badhusha Recipe in Telugu

  1. గిన్నెలో వెన్న వేసి కరిగించి, వంటసోడా, పెరుగు వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. 
  2. అందులో కొంచెం జీడిపప్పు పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి
  3. ఇప్పుడు మరో వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
  4. అందులోనే వెన్న మిశ్రమం వేసి బాగా కలపాలి. 
  5. తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి గట్టి పిండిలా కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
  6. పిండిని మృదువుగా కలుపుతూ వాటిని కోన్ ల చుట్టుకోవాలి
  7. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.
  8. బాదుషాలు వేగే సమయంలోనే పక్కన విడిగా ఓ గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి సన్నని తీగ పాకం రానివ్వాలి. 
  9. ఆపై స్టవ్‌ ఆఫ్‌ చేసి యాలకులపొడి, నిమ్మరసం కలపాలి. వేగిన బాదుషాలను తీసిన వెంటనే పంచదార పాకంలో వేసి సుమారు పది నిమిషాలు ఉంచి తీయాలి. 
  10. ఆరాక వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

Reviews for Kaju badhusha Recipe in Telugu (0)