కివీ కరాచి హల్వా | Kiwi karachi halwa Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kiwi karachi halwa recipe in Telugu,కివీ కరాచి హల్వా, Indira Bhaskar
కివీ కరాచి హల్వాby Indira Bhaskar
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కివీ కరాచి హల్వా వంటకం

కివీ కరాచి హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kiwi karachi halwa Recipe in Telugu )

  • కివీ పండు 1 లేదా 2
  • కరాచి 1 కప్పు
  • పంచదార 1 కప్పు
  • నెయ్యి 1/4 కప్పు
  • బాదం పప్పు 6
  • కిస్మిస్ 15
  • యాలకుల పొడి 1/4 చెంచా

కివీ కరాచి హల్వా | How to make Kiwi karachi halwa Recipe in Telugu

  1. కివీ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ముందుగా ఒక బాండీ లోనెయ్యి వేసి కాగాక జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో కరాచి నూక వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి.
  3. ఇప్పుడు నూక వేగాక పైన కట్ చేసి ఉంచుకున్న కివి ముక్కల గుజ్జుని కూడా వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
  4. ఇప్పుడు అందులో ఒక్క కప్పుడు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ దీనిని ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు అందులో ఒక కప్పు పంచదార వేసి బాగా కరిగేవరకు కలుపుతూ ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు పైన రెండు చెంచాల నెయ్యి వేసి కలిపి అందులో బాదం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపి పైన బాదంపప్పు కిస్మిస్ ముక్కలతో అలంకరించి సర్వ్ చేస్తే కివీ హల్వా రెడీ.

నా చిట్కా:

దీనిని ఫ్రిజ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు.

Reviews for Kiwi karachi halwa Recipe in Telugu (0)