గుమ్మడివడియాలు తోటకూర పులుసు | Ash pampkin fryums amaranths pulusu Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ash pampkin fryums amaranths pulusu recipe in Telugu,గుమ్మడివడియాలు తోటకూర పులుసు, మనస్విని శెట్టి
గుమ్మడివడియాలు తోటకూర పులుసుby మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గుమ్మడివడియాలు తోటకూర పులుసు వంటకం

గుమ్మడివడియాలు తోటకూర పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ash pampkin fryums amaranths pulusu Recipe in Telugu )

  • గుమ్మడివడియాలు అరకప్పు
  • తోటకూర ఒక కప్పు
  • చింతపండు పులుసు ఒక కప్పు
  • బెల్లం తురుము రెండు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూన్
  • మెంతులు ఒక స్పూన్
  • జీలకర్ర ఒక స్పూన్
  • కరివేపాకు ఒక రెమ్మ
  • కారం రెండు స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు చిటికెడు
  • ఎండుమిర్చి 4
  • పచ్చిమిర్చి 6
  • ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
  • నూనె రెండు స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి ముద్ద ఒక స్పూన్

గుమ్మడివడియాలు తోటకూర పులుసు | How to make Ash pampkin fryums amaranths pulusu Recipe in Telugu

  1. ముందుగా పాన్ పెట్టి నూనె వేయాలి
  2. నూనె వేడెక్కిన తరువాత గుమ్మడి వడియాలు వేయించాలి
  3. దోరగా వేగిన వడియాలు ఒక ప్లేట్లో పక్కకి తీసి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళీ పాన్ లో నూనె వేసి వేడిచేయాలి
  5. నూనెలో ఎండుమిర్చి,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు, మెంతులు వేసి వేయించాలి
  6. తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేయాలి
  7. ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి బాగా మగ్గించాలి
  8. ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి మగ్గుతుండగా ఉప్పు,కారం ,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి
  9. ఇప్పుడు కోసిపెట్టుకున్న తోటకూర వేసి బాగా మగ్గించాలి
  10. తోటకూర కూడా మగ్గిన తరువాత చింతపండు పులుసు వేయాలి
  11. చింతపండు పులుసు వేసాకా బాగా మరిగించాలి
  12. చింతపండు పులుసు మరుగుతున్నపుడు బెల్లం, గుమ్మడి వడియాలు వేసుకోవాలి
  13. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించాలి
  14. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే పులుసు సిద్ధం

Reviews for Ash pampkin fryums amaranths pulusu Recipe in Telugu (0)