పప్పు గంగపాయల ఆకు కూర | DAL PARSELENA LEAF CURRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • DAL PARSELENA LEAF CURRY recipe in Telugu,పప్పు గంగపాయల ఆకు కూర, Ram Ram
పప్పు గంగపాయల ఆకు కూరby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

పప్పు గంగపాయల ఆకు కూర వంటకం

పప్పు గంగపాయల ఆకు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DAL PARSELENA LEAF CURRY Recipe in Telugu )

  • కందిపప్పు ఒక చిన్న కప్పు
  • గంగపాయల ఆకు 2 గుప్పెట్లు
  • టమాటో 1
  • చింతపండు చిన్న ముక్క
  • ఆవాలు 1/4స్పూన్
  • జీలకర్ర 1/4స్పూన్
  • మినపగుళ్లు 1/4స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • వెల్లులి ముక్కలు 1స్పూన్
  • పచ్చిమిర్చి 2
  • ఎండుమిర్చి 2
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • నూనె 4స్పూన్లు

పప్పు గంగపాయల ఆకు కూర | How to make DAL PARSELENA LEAF CURRY Recipe in Telugu

  1. ముందుగా ఆకులను తుంచుకోవాలి లేతగా ఉంటే వాటి కాడలు కూడా ముక్కలుగా చేసి వేసుకోవచ్చు..
  2. ఆకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి..
  3. ఇప్పుడు కంది పప్పుని ఉడికించి పెట్టుకోవాలి..
  4. పాన్ పెట్టి 4స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక 1స్పూన్ వెల్లులి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,ఎండుమిర్చి,1/4స్పూన్ మినపప్పు,1/4స్పూన్ ఆవాలు,1/4స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి..
  5. అన్ని వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకు వేసి వేయించాలి..ఈ ఆకు వేగేటపుడు ఆకు నుండి నీరు వస్తుంది ఆ నీరు అంత పోయేవరకు వేయించాలి..
  6. ఇప్పుడు కోసిన టమాటో ముక్కలు కొద్దిగా చింతపండు వేసి మగ్గనిచ్చి ఉడికించిన పప్పు,పసుపు ఉప్పు వేసి దగ్గరపడనివ్వాలి..

నా చిట్కా:

తాలింపు కి నూనె బదులు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది..ఈ ఆకు కూరను మనం సులభంగా ఇంట్లో పండించుకోవచ్చు

Reviews for DAL PARSELENA LEAF CURRY Recipe in Telugu (0)