గోంగూర పచ్చడి | Gongura pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gongura pachadi recipe in Telugu,గోంగూర పచ్చడి, Sree Vaishnavi
గోంగూర పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    23

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

గోంగూర పచ్చడి వంటకం

గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura pachadi Recipe in Telugu )

  • గోంగూర : ఒక కిలో 
  • నూనె : రెండు టీ స్పూన్లు
  • జీలకర్ర : 25 గ్రాములు 
  • ధనియాలు : 100 గ్రాములు 
  • ఎండు మిరపకాయలు : 15 
  • వెల్లుల్లి రేక్కలు : 10
  • ఆవాలు : ఒక టీ స్పూన్
  • ఇంగువ : ఒక టీ స్పూన్
  • కరివేపాకు : రెండు రెబ్బలు

గోంగూర పచ్చడి | How to make Gongura pachadi Recipe in Telugu

  1. గోంగూర ఆకుల్ని కడిగి నీరులేకుండా వడకట్టేయాలి. 
  2. మూకుడులో ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి జీలకర్ర, (కొద్దిగా ఉంచి) ధనియాలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, గోంగూర ఆకులు వేయించి చల్లారాక రుబ్బుకోవాలి. 
  3. విడిగా ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. 
  4. జీలకర్ర,ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపుపెట్టి గోంగూర మిశ్రమంలో కలపాలి. అంతే గోంగూర పచ్చడి రెడీ.

Reviews for Gongura pachadi Recipe in Telugu (0)