చల్లపిండి ( చల్ల ఉప్మా) | Curd upma Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curd upma recipe in Telugu,చల్లపిండి ( చల్ల ఉప్మా), మనస్విని శెట్టి
చల్లపిండి ( చల్ల ఉప్మా)by మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

చల్లపిండి ( చల్ల ఉప్మా) వంటకం

చల్లపిండి ( చల్ల ఉప్మా) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd upma Recipe in Telugu )

  • బియ్యం పిండి ఒక కప్పు
  • మజ్జిగ రెండు కప్పులు
  • పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్లు
  • ఉల్లిపాయలు ముక్కలు పావు కప్పు
  • కేరట్ తురుము పావు కప్పు
  • జీలకర్ర 1/4 స్పూను
  • ఆవాలు 1/4 స్పూను
  • పచ్చి సేనగపప్పు 1/2 స్పూను
  • మినప్పప్పు 1/4 స్పూను
  • కరివేపాకు ఒక రెమ్మ
  • కొత్తిమీర ఒక స్పూను
  • ఉప్పు రెండు స్పూన్లు
  • నూనె రెండు స్పూన్లు

చల్లపిండి ( చల్ల ఉప్మా) | How to make Curd upma Recipe in Telugu

  1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి
  2. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సేనగపప్పు ,కరివేపాకు వేసుకోవాలి
  3. తాలింపు వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  4. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా కేరట్ ముక్కలు కూడా వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి,మజ్జిగ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
  6. ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తరువాత బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి కలపాలి
  7. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి
  8. ఉప్మా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  9. ఉప్మా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆపేయాలి
  10. చల్ల ఉప్మా సిద్ధం

Reviews for Curd upma Recipe in Telugu (0)