ఉల్లిపాయ పులుసు | VULLIPAAYA pulusu Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • VULLIPAAYA pulusu recipe in Telugu,ఉల్లిపాయ పులుసు, Kavitha Perumareddy
ఉల్లిపాయ పులుసుby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

3

0

ఉల్లిపాయ పులుసు వంటకం

ఉల్లిపాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VULLIPAAYA pulusu Recipe in Telugu )

  • ఉల్లిపాయలు పావు కేజీ
  • పచ్చిమిర్చి 3
  • చింతపండు నిమ్మకాయ సైజు
  • ఉప్పు తగినంత .
  • పసుపు కొంచెం.
  • కారం చిన్న స్పున్
  • నూనె రెండు పెద్ద స్పూన్స్
  • పోపుగింజెలు స్పున్.
  • ఎండుమిర్చి 3
  • కరేపాకు కొద్దిగా ..
  • వెల్లుల్లి 6 రెబ్బలు .

ఉల్లిపాయ పులుసు | How to make VULLIPAAYA pulusu Recipe in Telugu

  1. ముందుగా చింతపండు కడిగి కొద్దిగా నీళ్లుపోసి నానబెట్టుకోవాలి.
  2. ఈచింతపండు నానే లోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద ఒక బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజెలు,ఎండుమిర్చి ,వెల్లుల్లి, కరేపాకు వేసుకొని వేగినతారువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తగినంత ఉప్పు కూడా వేసి చిన్న మంట మీద మగ్గించాలి.
  4. ఇప్పుడు కారం, పసుపు,వేసి కలపాలి.తరువాత చింతపండు రసం వేసి ఉడికించాలి.
  5. అంతే ఇక ఉల్లిపాయపులుసు రెడీ .
  6. మీకు తీపి ఇష్టం ఐతే కొద్దిగా బెల్లము కూడా వేసుకోవచ్చు...

నా చిట్కా:

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళకు నీళ్లు రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయలను కొద్దిగ సేపు చల్లనీటిలో వేసి ఉంచితే సరి...

Reviews for VULLIPAAYA pulusu Recipe in Telugu (0)