హోమ్ / వంటకాలు / వంకాయ బీరకాయ టమాటో పచ్చడి

Photo of VANKAYA BEERAKAYA TOMATO CHUTNEY by Ram Ram at BetterButter
575
0
0.0(0)
0

వంకాయ బీరకాయ టమాటో పచ్చడి

Aug-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ బీరకాయ టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది..ఇడ్లి దోసకి కూడా కాంబినేషన్ బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వంకాయలు 4
  2. బీరకాయ 1
  3. టొమాటోలు 2
  4. కరివేపాకు కొద్దిగా
  5. సేనగపప్పు 4స్పూన్లు
  6. మినపప్పు 4స్పూన్లు
  7. జీలకర్ర 1స్పూన్
  8. వెల్లులి రెబ్బలు 5
  9. ఎండు మిర్చి6
  10. చింతపండు చిన్న కాడ
  11. ఉప్పు సరిపడా
  12. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా వంకాయలు నూనె రాసి స్టవ్ మీద కాల్చి పొట్టు తీసి పెట్టుకోవాలి..
  2. బీరకాయ తొక్కు తీసి బీరకాయను ముక్కలు చేసి పెట్టుకోవాలి..
  3. టొమాటోలు ముక్కలు చేసుకోవాలి..
  4. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర,4స్పూన్ల మినపప్పు,4స్పూన్ల సనగపప్పు,ఎండు మిర్చి 6,వెల్లులి రెబ్బలు 5 వేసి వేయించి బీరకాయ ముక్కలు వేసి వేయించాలి ..
  5. టమాటో ముక్కలు వేసి మగ్గించి చింతపండు కాడ వేసుకోవాలి..ఇప్పుడు స్టవ్ ఆపేయాలి..
  6. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో..వంకాయలు మరియు వేయించిన బీరకాయ టమాటో వాటిని తీసుకుని ఉప్పు వేసి..చట్నీ గ్రైండ్ చేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర