పాలక్ పనీర్ | Palak Paneer Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak Paneer recipe in Telugu,పాలక్ పనీర్, Tejaswi Yalamanchi
పాలక్ పనీర్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పాలక్ పనీర్ వంటకం

పాలక్ పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak Paneer Recipe in Telugu )

  • 200 గ్రాములు పాలకూర
  • 200 గ్రాములు పనీర్
  • 1/2 కప్పు టమాటో పేస్ట్
  • 2 మీడియం ఉల్లిపాయలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 25 నుండి 30 గ్రాములు వెన్న
  • 1 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp సోంపు
  • 2 యలుకలు
  • 3 లవంగాలు
  • 2 దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
  • చిటికెడు పంచదార
  • ఉప్పు తగినంత
  • 1 tsp కారం
  • 1 tsp గరం మసాలా
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp పసుపు
  • 1/4 కప్పు నీళ్లు
  • 2 tbsp క్రీమ్

పాలక్ పనీర్ | How to make Palak Paneer Recipe in Telugu

  1. ముందు పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పనీర్ ముక్కలను అందులో వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టాలి.
  3. పాలకూరను శుభ్రంగా కడిగిన తరువాత మరిగిన నీటిలో ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు నానబెట్టాలి.
  4. వేడి నీళ్లను వంపేసి వెంటనే బాగా చల్లని నీళ్లలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి.
  5. తర్వాత నీళ్లను వంపేసి, పాలకూరను బ్లెండర్ జార్ లోకి తీసుకొని, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ప్యూరీ లా చేసుకోవాలి.
  6. ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  7. ఒక పెనంలో వెన్న వేసి కరగనివ్వాలి.
  8. జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  9. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి.
  11. తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
  12. 1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
  13. వేడిగా వడ్డించాలి.

Reviews for Palak Paneer Recipe in Telugu (0)