దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ | Dosa,yerrakaram, bombayee chetney Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dosa,yerrakaram, bombayee chetney recipe in Telugu,దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ, Pendekanti Suneetha
దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ వంటకం

దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosa,yerrakaram, bombayee chetney Recipe in Telugu )

  • బియ్యం 3 గ్లాస్
  • అటుకులు 1 గ్లాస్
  • మెంతులు 1 స్పూన్
  • పెరుగు 4 గ్లాస్
  • ఎర్రకారం కోసం ఉల్లిపాయలు ముక్కలు 1 పెద్ద కప్
  • ఎండు మిర్చి 8
  • ఉప్పు తగినంత
  • బొంబాయి చెట్నీ కోసం
  • ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్
  • పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్
  • సేనగపింది 2 స్పూన్స్
  • పుల్లపెరుగు 1 పెద్ద కప్
  • పోపు దినుసులు
  • ఆయిల్ 1 స్పూన్

దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ | How to make Dosa,yerrakaram, bombayee chetney Recipe in Telugu

  1. బియ్యము,అటుకులు,మెంతులు అన్ని కలిపి బాగా కడిగి మునిగెటట్లు పెరుగు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి.
  2. ప్రొద్దున్నే ఆ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి 2 గంటలు నాననివ్వాలి.తర్వాత దోసెలు వేసుకోవాలి.
  3. ఎర్ర కారం కోసం
  4. ఉల్లిపాయలముక్కలు,ఎండుమిర్చి, ఉప్పు కలిపి బరకగా మిక్సీలో గ్రైండ్ చేయాలి
  5. బొంబాయి చెట్నీ కోసం
  6. ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి పచ్చి మిర్చి,ఉల్లిపాయముక్కలు వేసి మగ్గనిచ్చి అందులో పుల్లపేరుగులో సనగపింది,ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వేసి ఉదకనివ్వాలి.పసుపు వెయ్యరాదు.
  7. ఈ దోసలుకు ఎర్రకారం బొంబాయి చెట్నీ కలిపి దోసకు పూసి పుట్నాలపొడి చల్లాలి. చాలా టెస్టుగా ఉంటుంది

Reviews for Dosa,yerrakaram, bombayee chetney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo