హోమ్ / వంటకాలు / ఆకుకూర వాక్కాయ పులుసు

Photo of Leafy veg vakkaya grevy curry by Chandrika Marripudi at BetterButter
740
0
0.0(0)
0

ఆకుకూర వాక్కాయ పులుసు

Aug-12-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుకూర వాక్కాయ పులుసు రెసిపీ గురించి

2,3రకాల ఆకు కూరలు 2,3రకాల పప్పులతో కలిపి చేసుకునే పులుసు కూర.చింతపండు బదులుగా వాక్కాయలు దొరికితే అవి వేసుకుని చేసుకుంటే రుచి ఆరోగ్యం రెండు ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర:2కట్టలు
  2. పాలకూర:2కట్టలు
  3. టొమాటోలు:4
  4. కందిపప్పు:గుప్పెడు
  5. పెసరపప్పు:గుప్పెడు
  6. ఉల్లిపాయలు:2
  7. పచ్చి మిర్చి:4
  8. వాక్కాయలు:10
  9. ఉప్పు:తగినంత
  10. కారం:2స్పూన్లు
  11. పసుపు:చిటికెడు
  12. నూనె:2స్పూన్లు
  13. ఆవాలు:1స్పూన్
  14. జీలకర్ర:1స్పూన్
  15. ధనియాలు:2స్పూన్లు
  16. వెల్లుల్లి రెబ్బలు:6
  17. కరివేపాకు:2రెమ్మలు
  18. కొత్తిమీర:కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లి, టొమాటో, పచ్చి మిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.
  3. కందిపప్పు, పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి.
  4. పైవన్నీ కుక్కర్లో వేసి ఉప్పు, కారం‌,పసుపు, వాక్కాయలు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి 4,5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  5. ప్రెషర్ పోయాక మూత తీసి కలపాలి
  6. పోపు పాన్ లో 2 స్పూన్లు నూనె వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర,ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేగాక కూరలో వేసి కలుపుకుని తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర