బీట్రూట్, క్యారెట్ వేపుడు | Beetroot,carrot fry Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot,carrot fry recipe in Telugu,బీట్రూట్, క్యారెట్ వేపుడు, Chandrika Marripudi
బీట్రూట్, క్యారెట్ వేపుడుby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

బీట్రూట్, క్యారెట్ వేపుడు వంటకం

బీట్రూట్, క్యారెట్ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot,carrot fry Recipe in Telugu )

  • బీట్రూట్ : 3
  • క్యారెట్ : 2
  • ఉల్లిపాయలు : 2
  • పచ్చి మిర్చి : 4
  • వెల్లుల్లికారం : 1స్పూన్
  • ఆవాలు : 1స్పూన్
  • జీలకర్ర : 1 స్పూన్
  • పచ్చిశనగపప్పు : 3స్పూన్లు
  • సాయమినప్పప్పు : 2 స్పూన్లు
  • ఎండుకొబ్బరి పొడి : 3 స్పూన్లు
  • ఉప్పు : తగినంత
  • కరివేపాకు : 2 రెబ్బలు
  • కొత్తిమీర : కొద్దిగా
  • నూనె : 2 స్పూన్లు
  • పసుపు: చిటికెడు

బీట్రూట్, క్యారెట్ వేపుడు | How to make Beetroot,carrot fry Recipe in Telugu

  1. బీట్రూట్, క్యారెట్ పీల్ చేసి సన్నగ ముక్కలు తరగాలి.
  2. ఉల్లి, పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు,కరివేపాకు వేసి వేగాక ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  4. తరువాత తరిగిన బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి.
  5. ఉప్పు,పసుపు వేసి కలిపి వేయించాలి.
  6. ముక్కలు మెత్తబడి వేగాక ఎండుకొబ్బరి పొడి,వెల్లుల్లికారం వేసి కలిపి ఒక నిముషం వేయించాలి.
  7. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి.

Reviews for Beetroot,carrot fry Recipe in Telugu (0)