హోమ్ / వంటకాలు / మిరియాల రసం

Photo of Blackpepper rasam by Sree Sadhu at BetterButter
444
1
0.0(0)
0

మిరియాల రసం

Aug-12-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరియాల రసం రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది జలుబు చేస్తే వెంటనే ఇది చేసుకుని తింటే జలుబు ఇట్టే ఎగిరిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మిరియాల పొడి 1/2 చెంచా
  2. జీలకర్ర 1/2 చెంచా
  3. ఎండుమిరపకాయలు 2-3
  4. 6-7 వెల్లులిపాయలు
  5. 1/2 చెంచా చింతపండు
  6. 3 కప్ నీళ్లు
  7. 1 టమాటో క్రష్ చేసినది
  8. 1 చెంచా ఆవాలు
  9. కరివేపాకు 1 రెబ్బ
  10. 1/8 చెంచా పసుపు
  11. చిటికెడు ఇంగువ
  12. 1 చెంచా నూనె

సూచనలు

  1. ముందుగా కొంచెం వేడి నీళ్లలో చింతపండు వేసి అరగంట నాన్నబెట్టుకోవాలి
  2. తరువాత చింతపండు లోంచి నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత మిక్సీ జార్ లో వెల్లులిపాయలు, ఎండుమిరపకాయలు, మిరియాలు ,జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసుకుని అందులో ఆవాలు వేసుకోవాలి
  5. అది వేగిన తరువాత అందులో కరివేపాకు తయారుచేసిన పొడి ఒక నిమిషము వేయించాలి
  6. అందులో పసుపు ఇంగువ వేసి బాగా కలుపుకొని అందులో చింతపండు రసం వేసి నీళ్లు పోసుకోవాలి
  7. ఉప్పు మరియు క్రష్ చేసిన టమాటో వేసుకుని బాగా కలిపి 13-17 నిమిషాలు ఉడికించాలి
  8. ఉడికిన తరువాత చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర