బియ్యము అటుకులు | Biyyam atukulu Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Biyyam atukulu recipe in Telugu,బియ్యము అటుకులు, Pendekanti Suneetha
బియ్యము అటుకులుby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

బియ్యము అటుకులు వంటకం

బియ్యము అటుకులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biyyam atukulu Recipe in Telugu )

  • బియ్యము 1 గ్లాస్
  • చింతపండు గుజ్జు 4 స్పూన్స్
  • ఉల్లిపాయముక్కలు 1 చిన్న కప్
  • పచ్చిమిర్చి పెస్ట్ 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ 4 స్పూన్స్
  • ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
  • సేనగపప్పు 1 స్పూన్
  • పసుపు అర స్పూన్
  • కరివేపాకు కొంచెం
  • కొత్తిమీర 1 స్పూన్
  • చక్కెర 1 స్పూన్

బియ్యము అటుకులు | How to make Biyyam atukulu Recipe in Telugu

  1. 1. ఒక బాణలిలో బియ్యం వేసి మీడియం మంటపై వేయించాలి.అవి తెల్లగా పొంగుతాయి.5 నిమిషాలు పడుతుంది. కలుపుతూ ఉండాలి.
  2. 2.ఆ బియ్యాన్ని కడిగి 2 గ్లాసుల నీళ్లు వేసి కూకర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి.
  3. 3.స్టీమ్ పోయాక అన్నాన్ని చల్లారా బెట్టాలి.
  4. 4.ఒక బాణలిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేసి వేగాక సేనగపప్పు, మినపప్పు వేసి వేగాక కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి వేగాక పచ్చి మిర్చి పేస్ట్ ,ఉప్పు,చింతపండు గుజ్జు,పసుపు, చక్కెర వేసి బాగా కలిపి ఉడికించాలి.
  5. 5.బాగా ఉడికి చిక్కబడ్డాక అందులోచల్లారిన అన్నం వేసి చిన్న మంటపై బాగా కలపాలి.
  6. 6.మూత పెట్టి చిన్నపంటపై 5 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి

Reviews for Biyyam atukulu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo