కాకరకాయ పులుసు | Bittergourd pulusu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bittergourd pulusu recipe in Telugu,కాకరకాయ పులుసు, Sree Vaishnavi
కాకరకాయ పులుసుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కాకరకాయ పులుసు వంటకం

కాకరకాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bittergourd pulusu Recipe in Telugu )

  • కాకరకాయలు---4
  • ఆవాలు---1/4 స్పూన్
  • ఇంగువ---చిటికెడు
  • కరివేపాకు---2 రెమ్మలు
  • చింతపండు---నిమ్మకాయంత
  • కారం---1/2 స్పూన్
  • పసుపు--చిటికెడు
  • బెల్లం 2-3 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 2-3
  • నూనె 2-3 చెంచాలు
  • ఉల్లిపాయలు 3-4

కాకరకాయ పులుసు | How to make Bittergourd pulusu Recipe in Telugu

  1. చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి
  2. కాకరకాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  3. ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి
  6. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి మూత పెట్టి
  7. కాకరకాయ ముక్కలు వేగాక అందులో చింతపండు పులుసు పోసుకుని బాగా ఉడికంచుకోవాలి
  8. అందులో తగినంత ఉప్పు కారం బెల్లం నీళ్లు పోసి బాగా ఉడికించాలి అంతే వేడి వేడి కాకరకాయ పులుసు తయారు
  9. ఇది ముద్దపప్పు మరియు కంది పొడి తో తింటే అద్భుతంగా ఉంటుంది

నా చిట్కా:

పులుసు బాగా పలచగా ఉంటె కొంచెం బియ్యంపిండి నీళ్లలో కలిపి వేసుకోవచ్చు అప్పుడు కొంచం చిక్కగా ఉంటుంది

Reviews for Bittergourd pulusu Recipe in Telugu (0)