పబ్బియ్యం | Pabbiyyam Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pabbiyyam recipe in Telugu,పబ్బియ్యం, Lakshmi Leelavathi
పబ్బియ్యంby Lakshmi Leelavathi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

పబ్బియ్యం వంటకం

పబ్బియ్యం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pabbiyyam Recipe in Telugu )

  • బియ్యం 2 కప్పులు
  • కందిపప్పు 1/4కప్పు
  • పెసరపప్పు కొంచెం
  • టమాటో 2
  • బంగాళదుంప 2
  • ఉల్లిపాయలు 2
  • carrot 2
  • బీట్రూట్ 1( చిన్నది)
  • పచ్చిమిర్చి 4
  • పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు
  • ఉప్పు రుచికిసరిపడ
  • కరివేపాకు కొంచెం
  • కొత్తిమీర కొంచెం
  • నూనె
  • తాలింపు గింజలు
  • పచ్చినపప్పు

పబ్బియ్యం | How to make Pabbiyyam Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల బియ్యం ,1/2గ్లాసు కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసికడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. అందులో carrot, బీట్రూట్, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయలు ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యంలో వేసి అన్నంవండుకోవాలి.
  3. తరువాత మిక్సిజార్లో కొబ్బరి, పచ్చి మిర్చి వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  4. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో తాలింపు కి సరిపడా నూనె వేసుకుని అందులో మనo ముందుగా తాళింపు వేసి వేగాక అందులో కరివేపాకు,ఇంగువ కూడా వేసుకుని ముందుగా మిక్సీ వేసిన కొబ్బరి,పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని బాగాకలపాలి.
  5. తర్వాత మనం ఉడికించుకున్న కూరగాయల అన్నాన్ని కూడఅందులో వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు చల్లుకుని బాగాకలిపి పైన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి పబ్బియ్యం సిద్ధం అయినట్లే.

నా చిట్కా:

ఈ పబియ్యం ని సాంబర్తో పాటు తింటే చాలా బాగుంటుంది.

Reviews for Pabbiyyam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo