పొట్లకాయ పెసరపప్పు పొడి కూర | Snake gourd moongdal dry curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Snake gourd moongdal dry curry recipe in Telugu,పొట్లకాయ పెసరపప్పు పొడి కూర, Sree Vaishnavi
పొట్లకాయ పెసరపప్పు పొడి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

పొట్లకాయ పెసరపప్పు పొడి కూర వంటకం

పొట్లకాయ పెసరపప్పు పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Snake gourd moongdal dry curry Recipe in Telugu )

  • పొట్లకాయ సన్నగా తరిగినది 2 కప్స్
  • పెసరపప్పు 1 కప్
  • నీళ్లు తగినంత
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • కారం తగినంత
  • నూనె 4-5 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ

పొట్లకాయ పెసరపప్పు పొడి కూర | How to make Snake gourd moongdal dry curry Recipe in Telugu

  1. ముందుగా పెసరపప్పుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. తరువాత మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి మరిగాక అందులో తగిన పొట్లకాయ వేసుకోవాలి మరియు ఉప్పు పసుపు వేసి ఒక మరుగురానివ్వాలి
  3. తరువాత నీళ్లు వార్చుకోవాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉడికిన పొట్లకాయ వేసి రెండు నుంచి ఐదు నిమిషాలు వేయించాలి
  7. వేగిన తరువాత పైన పెసరపప్పు వేసి ఉడకనివ్వాలి
  8. ఉడికిన తరువాత అందులో ఉప్పు కారం వేసి రెండు నిముషాలు వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు

Reviews for Snake gourd moongdal dry curry Recipe in Telugu (0)