హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లికారము

Photo of brinjal  curry by Shobha.. Vrudhulla at BetterButter
719
1
0.0(0)
0

వంకాయ ఉల్లికారము

Aug-15-2018
Shobha.. Vrudhulla
600 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లికారము రెసిపీ గురించి

వంకాయ ఉల్లికారము అన్నంతో కానీ రొట్టెలతో కానీ తినొచ్చు.మాములుగా ఉల్లికారము రుబ్బి ఉల్లిముద్దతో చేస్తారు.కానీ ఆ టైంకి కరెంట్ లేకపోవటం యి ఆలోచనవచ్చి ఉల్లిపాయలు రుబ్బాకుండానే చేసాను..

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలుచిన్నవి 15
  2. పెద్ద ఉల్లిపాయలు3
  3. టొమాటపెద్దవి 3
  4. అల్లం వెల్లుల్లి ముద్ద 1చెంచా
  5. ఉప్పు తగినంత
  6. పసుపు చిటికెడు
  7. కారము 3 చెంచాలు,కావాలంటే ఎక్కువ తక్కువ చేసి వేసుకో వచ్చు మనకు కావలసిన దాని బట్టి
  8. ధనియాల పొడి 2చంచాలు
  9. జీలకర్ర పొడి 1చెంచా
  10. గరం మసాలా గుండా 1 చెంచా..
  11. తగినంత నూనె లేదా 1కప్పుడు నూనె
  12. కొత్తిమీర కొంచెము..

సూచనలు

  1. ముందుగా వంకాయాలు కడిగి మూడికలు సగం తరిగి వంకాయలని 4 గంటలు ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచుకోవాలి.
  2. ఆ తరువాత ఉల్లిపాయలు బాగా చినవ్విగా తరిగి పెట్టుకోవాలి
  3. టమోటాలు కూడా కడిగి గ్రైండ్ చేసి ముద్దని రెడీగా ఉంచుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి బాగా కాగాక అందులో నూనె వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేదాకా వేగనివ్వాలి. సూచన*. ఇత్తడి గిన్నెలో చేసిన వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది .అందుకే నేను ఇత్తడి గిన్నె వాడుతాను
  5. ఉల్లిపాయలు వేగాక అందులో టమోటా ముద్ద వేసి కాస్త వేగణించక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి.
  6. ఆ తరువాత ఉప్పు,పసుపు,కారము, దనియాల పొడి , జీలకర్ర పొడి ,గరం మసాలా పొడి వేసి నూనె టెలి వరకు వేగనివ్వాలి .
  7. వేగాక ఇప్పుడు వంకాయలు వేసి ఒక 2నిమిషాలు నీళ్లు పోయకుండా జాగ్రత్తగా వంకాయలని కింద మీద కలుపుతూ మగ్గించాలి .
  8. 2నిమిషాలు తరువాత వంకాయలు , మసాలా ముద్ద కలసి వేగటం వలన వంకాయల్లో కాస్త మెరుపు వస్తుంది.అప్పుడు కూరలో 1గ్లాస్ నీళ్లు పోసి కాస్త అటు ఇటుగా కలిపి మూత పెట్టి తక్కువ సెగ మీద కూరని ఉడికించాలి.
  9. వంకాయలకి ముందు 2నిమిషాలు ఉల్లి ముద్దలో మరియు నూనెలో వేయించాము కాబట్టి నీళ్ళల్లో ఎక్కువ ఉడికించనవసరము లేదు
  10. 5 నిమిషాలు తరువాత ముత తీసి చూడండి వంకాయలు ఉడికిపోతాయి
  11. ఇప్పుడు కూర దించి ఒక బౌల్ల్లో తీసుకొని కొత్తిమీర వేసి వేడి వేడిగా అన్నముతో తింటే చాలా రుచిగా ఉంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర