ములక్కాడ సాంబారు | Drumstick Sambar Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick Sambar recipe in Telugu,ములక్కాడ సాంబారు, Sukriti Siri
ములక్కాడ సాంబారుby Sukriti Siri
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

ములక్కాడ సాంబారు వంటకం

ములక్కాడ సాంబారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick Sambar Recipe in Telugu )

  • 1/2 కప్పు : కందిపప్పు
  • 50 గ్రా : చింతపండు
  • 2 : ములక్కాడలు పెద్దవి
  • 2 : బంగాళా దుంపలు
  • 1 : కారెట్
  • 10 : చిరుల్లి
  • 10 : ఆనపకాయ ముక్కలు
  • 2 : పచ్చి మిరపకాయలు
  • 2 : ఎండు మిరపకాయలు
  • 2 రెమ్మలు : కరివేపాకు
  • 1/4 చెంచా : పసుపు
  • ఉప్పు తగినంత
  • చిన్న ముక్క : బెల్లము
  • 1/2 కప్పు : కొత్తిమీర
  • నీళ్లు సరిపడా
  • సాంబారు మసాలా కి : 2 చెంచాలు : సెనెగ పప్పు
  • 2 చెంచాలు : ధనియాలు
  • 4 : ఎండు మిరపకాయలు
  • 1 చెంచా : జీలకర్ర
  • 6 : మిరియాలు
  • 1/8 చెంచా : ఇంగువ
  • 1 చెంచా : ఎండు కొబ్బరి
  • 1 చెంచా : నెయ్యి
  • పోపు కి కావాల్సినవి : 2 చెంచాల : నెయ్యి
  • 1 చెంచా : నూనె
  • 1 చెంచా : ఆవాలు
  • 1 చెంచా : జీలకర్ర
  • 1 : ఎండు మిరపకాయ
  • చిటికెడు : ఇంగువ

ములక్కాడ సాంబారు | How to make Drumstick Sambar Recipe in Telugu

  1. సాంబారు చేసుకునే ముందు మసాలా పొడి సిద్ధం చేసుకుందాం. అందుకు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక చెంచాడు నెయ్యి వేసి వరుసగా సెనెగె పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసుకొని దోరగా వేయించుకుని చాల్లార్చుకోండి.
  2. చల్లారని తరువాత మిక్సీ లో వేసుకొని, కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దను రుబ్బి పెట్టుకోండి.
  3. ఇక సాంబారు విషయానికి వస్తే చింతాపండుని 15 నిమిషాల పాటు నీళ్లలో నాన బెట్టుకొని చిక్కటి రసం తీసుకొని పిప్పి ని వేరు చేసుకోండి.
  4. కందిపప్పు ని శుభ్రం చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా , నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి.
  5. కుక్కర్ చల్లారిన తరువాత పప్పు గుత్తి తో ఏనుపుకొని పెట్టుకోండి.
  6. ఒక లోతైన మూకుడు లేదా గిన్నెలో చింతపండు రసం, పసుపు,ఉప్పు, బెల్లం, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు మరియు 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి.
  7. తరిగి పెట్టుకున్న బంగాళా దుంప, ముల్లకాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు ,ఆనపకాయ ముక్కలు, చిరుల్లి కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి.
  8. ముక్కలు ఉడికెంత వరకు మూత పెట్టుకొని మరిగించుకోండి.
  9. కూరలు కాస్త మెత్తబడ్డాక ఉడికించి ఏనుపుకున్న పప్పుని మరియు రుబ్బి పెట్టుకున్న సాంబారు మసాల ముద్దని కూడా వేసి కలుపుకొని మరో 8 నుండి 10 నిమిషాల పాటు మరగించండి.
  10. చివరిగా పోపు గిన్నెలో నెయ్యి, నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇంగువ తో పోపు పెట్టుకొని మారుగుతున్న సాంబారు లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది.
  11. ఎంతో శ్రేష్ఠమైన ముల్లకాడ సాంబారు తయారు.

నా చిట్కా:

పూర్తిగా కంది పప్పు కాకుండా సగం కంది పప్పు సగం పెసర పప్పు కలిపి చేసుకుంటే కూడా సాంబారు ఎంతో రుచిగా ఉంటుంది.

Reviews for Drumstick Sambar Recipe in Telugu (0)