సర్వపిండి | Sarvapindi Recipe in Telugu

ద్వారా Saritha Kura  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sarvapindi recipe in Telugu,సర్వపిండి, Saritha Kura
సర్వపిండిby Saritha Kura
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

సర్వపిండి వంటకం

సర్వపిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sarvapindi Recipe in Telugu )

  • బియ్యంపిండి. 1/2kg
  • నానబెట్టిన శనగపప్పు. 1/4కప్పు
  • నువ్వులు. 1/4కప్పు
  • పచ్చిమిర్చి. 10
  • ఉప్పు. తగినంత
  • కారం. తగినంత
  • ఉల్లిఆకులు. 100gr
  • కరివేపాకు. 4 రెమ్మలు
  • కొత్తిమీర. 2కట్టలు
  • వెల్లుల్లి. 2 గడ్డలు
  • జీలకర్ర 2స్పూన్లు
  • గరం మసాలా. 1/4స్పూను
  • నూనె. 100ml
  • ఉల్లిఆకులు లేనప్పుడు ఉల్లిగడ్డలు మిక్సీ చేసి వేసుకోవచ్చు

సర్వపిండి | How to make Sarvapindi Recipe in Telugu

  1. పచ్చిమిర్చి,వెల్లుల్లి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.బియ్యంపిండిలో పై మిశ్రమం, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిఆకులు,పసుపు కరివేపాకు, జీలకర్ర,నువ్వులు, కొత్తిమీర, ఉప్పు,కారం,గరంమసాలా వెయ్యాలి. ఇందులో నీళ్ళు వేస్తూ కలపాలి.
  2. ఇందులో నీళ్ళు వేస్తూ కలపాలి. మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ముద్దలా ఉండాలి
  3. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి చుట్టూ నూనె రాయాలి పిండిని తీసుకొని గిన్నెచుట్టు లోపలి వైపు చేతితో ఒత్తాలి. పైన నూనె వెయ్యాలి కాస్తా నీళ్లు చల్లి గిన్నెని చుట్టూ తిప్పాలి
  4. ఇలా చేసి గిన్నె స్టవ్ పై మూత పెట్టి మీడియం మంట పై కాల్చాలి.
  5. ఫొటోలో చూపిన విదంగా కాలిన తరువాత స్టవ్ ఆపి గిన్నెలో నుంచి తీయాలి సర్వపిండి రెడి

Reviews for Sarvapindi Recipe in Telugu (0)