హోమ్ / వంటకాలు / బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె

Photo of Biyyam pindi karam rotte by Pendekanti Suneetha at BetterButter
2425
1
0.0(0)
0

బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె

Aug-21-2018
Pendekanti Suneetha
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె రెసిపీ గురించి

బియ్యం పిండి లో ఆకుకూరలు వేసి కారం వేసి చేసేది. ఇది ఉదయం టిఫిన్ కు చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యము పిండి. 1 పెద్దకప్
  2. సేనగపప్పు 1 స్పూన్
  3. పెసరపప్పు. 1 స్పూన్
  4. జీలకర్ర. 1 స్పూన్
  5. పచ్చిమిర్చి పేస్ట్. 2 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. ఆయిల్ చిన్న కప్
  8. కరివేపాకు చిన్నగా కట్ చేసినది 1 స్పూన్
  9. కొత్తిమీర కట్ చేసినది. 2 స్పూన్స్
  10. పాలకూర. కట్ చేసినది. 1 చిన్న కప్
  11. తోటకూర. కట్ చేసినది. 1 చిన్న కప్
  12. క్యారెట్ తురుము. 2 స్పూన్స్

సూచనలు

  1. సేనగపప్పు, పెసరపప్పు ను అరగంట సేపు నానబెట్టాలి.
  2. ఒక గిన్నెలో బియ్యం పిండి,జీలకర్ర,నానబెట్టిన సేనగపప్పు, పెసరపప్పు, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు,క్యారెట్ తురుము,కొత్తిమీర, కరివేపాకు,పాలకూర,తోటకూర అన్ని బాగా కలపాలి.
  3. ఈ పిండి కొద్దిగా తీసుకొని నీళ్లు వేసి గట్టిగా కలపాలి.చపాతీ పిండి లాగా కలపాలి.
  4. ఇప్పుడు మందంగా ఉన్న కవర్ పై ఆయిల్ వేసి దానిపై పిండి ముద్దను రొట్టెలగా పల్చగా తట్టాలి
  5. స్టవ్ పై పెన్నాం పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి హీట్ అయ్యాక కవర్ పై తట్టిన రొట్టెను కవర్ తో సహా పెన్నము పై వేయాలి.
  6. ఒక నిమిషం తర్వాత చిన్నగా కవర్ ను తీసేయాలి
  7. కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చాలి.
  8. ఈ రొట్టెకు గోంగూర పప్పు తో చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర