బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా | Biyyam ravva majjiga upma Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Biyyam ravva majjiga upma recipe in Telugu,బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా, Pendekanti Suneetha
బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మాby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

5

0

బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా వంటకం

బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biyyam ravva majjiga upma Recipe in Telugu )

  • బియ్యం రవ్వ 1 గ్లాస్
  • చిలికిన పుల్లని మజ్జిగ. 2 గ్లాస్
  • ఉల్లిగడ్డ ముక్కలు. 1 చిన్న కప్
  • పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  • ఆయిల్. 5 స్పూన్స్
  • ఆవాలు , జీలకర్ర. 1 స్పూన్
  • మినప్పప్పు. 1 స్పూన్
  • సేనగపప్పు. 1 స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర. 1 స్పూన్
  • ఉప్పు తగినంత

బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా | How to make Biyyam ravva majjiga upma Recipe in Telugu

  1. ఒక బాణలిలో బియ్యం రవ్వను వేసి చిన్న మంటపై ఒక 5 నిమిషాలు వేయించి పక్కకు తీయాలి.
  2. అదే బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు, సేనగపప్పు వేసి వేగాక అందులో ఉల్లిగడ్డలు వేసి వేగాక అందులో పచ్చిమిర్చి పేస్ట్,కరివేపాకు, ఉప్పు వేసి వేగాక అందులో 2 గ్లాస్ మజ్జిగ వెయ్యాలి.
  3. ఎసరు కాగాక అందులో బియ్యం రవ్వ వేసి కలుపుతూ చిన్న మంటపై మూత పెట్టి మగ్గించాలి
  4. ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి కలపాలి.
  5. ఇది చాలా రుచిగా పుల్ల పుల్లగా కార కారంగా ఉంటుంది.

Reviews for Biyyam ravva majjiga upma Recipe in Telugu (0)