చింతతొక్కు పచ్చడి | chintatokku pachhadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • chintatokku pachhadi recipe in Telugu,చింతతొక్కు పచ్చడి, Kavitha Perumareddy
చింతతొక్కు పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

చింతతొక్కు పచ్చడి వంటకం

చింతతొక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make chintatokku pachhadi Recipe in Telugu )

  • నిలువ చింతతొక్కు కప్
  • పచ్చిమిర్చి 15
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • జీలకర్ర స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • పోపుగింజెలు స్పున్
  • నూనె 2 స్పూన్స్
  • ఎండుమిర్చి పోపుకు 3

చింతతొక్కు పచ్చడి | How to make chintatokku pachhadi Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి .
  2. ఇప్పుడు రొటిలో ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి వేసి దంచి తరువాత ముడి చింతతొక్కు కూడా వేసి అంతా కలిసేలా దంచుకోవాలి .ఉప్పు అవసరం లేదు చింతతొక్కు లో ఉంటుంది.
  3. తరువాత బాండీలో స్పూన్ నూనె వేసి పోపుగింజెలు, కరేపాకు, ఎండుమిర్చి తో పోపు వేసి పచ్చడి వేసి కలపాలి .అంతే చాలా సులభం

నా చిట్కా:

చింతతొక్కు తరచుగా తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది

Reviews for chintatokku pachhadi Recipe in Telugu (0)