పులగం | Pulagam Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  31st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pulagam recipe in Telugu,పులగం, Sukanya Sukku
పులగంby Sukanya Sukku
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పులగం వంటకం

పులగం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pulagam Recipe in Telugu )

  • బియ్యం. 1 గ్లాసు
  • పెసర పప్పు 1/4 గ్లాస్
  • నీరు. తగినంత
  • పోపు. సామాను
  • నెయ్యి. 3 స్పూన్లు
  • జీలకర్ర. 1/2 స్పూన్
  • మిరియాలు. 10
  • కరివేపాకు. 3 రెమ్మలు
  • జీడిపప్పు. 10 పలుకులు
  • ఉప్పు. తగినంత

పులగం | How to make Pulagam Recipe in Telugu

  1. బియ్యం,పెసరపప్పు , నీరు తగినంత ఒక గిన్నలో పోసుకొ ని ఒకసారి కడిగి పావుగంట సేపు నానివ్వాలి
  2. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ లో గిన్నె పెట్టీ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూడు విజిల్స్ రాని వ్వాలి.
  3. తర్వాత పొయ్యి మీద బాండీ ఉంచి నెయ్యి వేసుకొని, నెయ్యి కాగ గానే అందులో జీలకర్ర, 10 మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు. వేసి వేగనివ్వాలి
  4. పోపు వెగగానె అందులో ఉడికించిన పులగం, తగినంత ఉప్పవేసి గరిట తో బాగా కలుపు కోవాలి. అంతే రుచికరమైన పులగం రెడీ

నా చిట్కా:

పులగం లో పెసరపప్పు ఆరోగ్యానికి చాలా చలువ చేస్తుంది

Reviews for Pulagam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo