నిమ్మకాయ పులిహోర | Lemon rice Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  4th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon rice recipe in Telugu,నిమ్మకాయ పులిహోర, Revathi Kumari
నిమ్మకాయ పులిహోరby Revathi Kumari
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    12

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

నిమ్మకాయ పులిహోర వంటకం

నిమ్మకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

  • నిమ్మకాయ రసం 4 చెంచాలు
  • ఉడికిన అన్నం 2 కప్పులు
  • పసుపు 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • పల్లీలు 2 చెంచాలు
  • ఇంగువ చిటికెడు
  • పచ్చిమిర్చి ౩-4
  • అల్లం 1 చెంచా
  • ఉడికించిన సెనగలు 3 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 2
  • నూనె ౩-4 చెంచాలు
  • కరివేపాకు 1 రెమ్మ

నిమ్మకాయ పులిహోర | How to make Lemon rice Recipe in Telugu

  1. ముందుగా అన్నం లో ఉప్పు ,పసుపు ,నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  3. అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు ,ఎండుమిర్చి ,ఇంగువ ,పల్లీలు వేసి వేగనివ్వాలి
  4. అందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించి నిమ్మరసం వేసి ఉడికించాలి
  5. దానిని పసుపు అన్నంలో వేసి బాగా కలిపి కొన్ని సెనగలు వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Lemon rice Recipe in Telugu (0)