హోమ్ / వంటకాలు / గుడ్డు కూర

Photo of Egg Curry by Kankana Saxena at BetterButter
3418
242
4.5(0)
0

గుడ్డు కూర

Aug-24-2015
Kankana Saxena
0 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు కూర రెసిపీ గురించి

భారతదేశంలో లెక్కలేనన్ని గుడ్డు కూరల పద్ధతులు ఉన్నాయి. నిజానికి కూర విషయానికొస్తే, అక్కడ నిబంధనలు ఉండవు. కేవలం మీ రుచి మొగ్గలని అనుసరించడమే. కొన్నిసార్లు నేను కొంచెం పొడిగా ఇష్టపడతా, కొన్నిసార్లు నేను అది కొంచెం జారుగా ఉండడానికి నీళ్ళు పోసి అన్నంతో వడ్డిస్తా.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • రాత్రి విందు
  • భారతీయ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన గుడ్లు - 3
  2. టమోటాలు - 2 (సన్నగా తరిగినవి)
  3. బంగాళదుంప- 1 (తరిగినది)
  4. ఉల్లిపాయ(పెద్దది సన్నగా తరిగింది)-1
  5. ఎండు మిరపకాయలు- 3 నుండి 4
  6. వెల్లుల్లి రెబ్బలు - 2 నుండి 3
  7. పచ్చి మిర్చి- 1
  8. పసుపు - 1 చెంచా
  9. జీలకర్ర పొడి- 1 చెంచా
  10. ధనియా పొడి- 1 చెంచా
  11. ఆమ్చుర్ పొడి- 1 చెంచా లేదా నిమ్మరసం- 1/2 చెంచా
  12. చక్కెర- 1/2 చెంచా
  13. కారం - 1/2 చెంచా
  14. తాజా అల్లం- 1/2 అంగుళం
  15. అలంకరణకి తాజా కొత్తిమీర
  16. నూనె
  17. రుచికి తగినంత

సూచనలు

  1. గుడ్లని ఉప్పునీళ్ళలో ఉడకబెట్టి, వాటిని చల్లని నీళ్ళలో ముంచి పై పెంకు తీసేయండి. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి మరియు ఎండు మిరపకాయలు రుబ్బి ముద్దగా చేయండి.
  2. పదునైన కత్తితో ఉడికించిన గుడ్లలో చిన్న చీలిక పెట్టండి. ఉప్పు, పసుపు, కారంతో రుద్దండి.
  3. లోతైన బాండీలో గుడ్లని కొంచెం వేయించండి. అవి కొంచెం బంగారు రంగులోకి మారాలి. అయ్యాక ప్రక్కకి పెట్టండి.
  4. మంటని ఆర్పేయవద్దు, కొంచెం నూనె వేసి చీల్చిన బంగాళదుంపలో వేయండి. ఉప్పుని జల్లి కలపండి.
  5. బంగాళదుంపలు మెత్తగా అయ్యేదాకా వేయించి ప్రక్కకు పెట్టండి. అదే బాండీలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముద్దని వేయండి. మిశ్రమం కొంచెం గోధుమ రంగులోకి మారాక తరిగిన ఉల్లిపాయలు, ఉప్పుని వేసి తరిగిన ఉల్లిపాయలు అస్పష్టంగా అయ్యేదాకా వండండి.
  6. మసాలా దినుసులు వేయాల్సినవి- జీలకర్ర పొడి, ధనియా పొడి, కలిపి మరియు తరిగిన టమోటాలని వేయండి.
  7. 1 నిమిషం వండి తర్వాత చక్కర వేయండి. టమోటాలు మెత్తగా అయ్యాక ఆమ్చూర్ పొడి లేదా నిమ్మరసం సగం చెక్క కప్పు నీళ్ళతో పాటు వేయండి.
  8. మరొక 1 నిమిషం వండి, వేయించిన బంగాళదుంపలు మరియు ఉడికించిన గుడ్లలో వేయండి. తక్కువ మంట పై 5 నిమిషాలు వండండి.
  9. తాజా కొత్తిమీరని వేసి వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర