హోమ్ / వంటకాలు / వెజ్ శాండ్విచ్

Photo of SANDWICH by Sandhya Rani Vutukuri at BetterButter
646
2
0.0(0)
0

వెజ్ శాండ్విచ్

Sep-11-2018
Sandhya Rani Vutukuri
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ శాండ్విచ్ రెసిపీ గురించి

పిల్లల కు, పెద్దలకు తినడానికి త్వరగా చేసి ఇవ్వడానికి మన జీవితాల్లో బ్రెడ్ పెద్ద భాగం అయ్యింది. అందరి వంట గదుల్లో వుండే వాటి తో ఈ సాండ్విచ్ చేస్తున్నాను. ఇది 2,3 రకాలు గా ఇంట్లో ఉన్న పదార్ధాల వుండే సౌకర్యం పట్టి చేయవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ బ్రెడ్ 6 స్లైస్
  2. ఉడికించిన ఆలూ 3
  3. తరిగిన ఉల్లి తరుగు 1 కప్పు
  4. టమాటలు 2
  5. పుదీనా 1 కట్ట(1 కప్పు ఆకులు)
  6. కొత్తి మీర 1 కప్పు ఆకులు
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్(తిననివారు వొదిలెయ్యండి)
  8. గరం మసాలా పొడి 1/2 చెంచా
  9. చాట్ మసాలా 1/2 చెంచా
  10. పచ్చి మిర్చి 2
  11. ఉప్పు 1 చెంచా
  12. కారం పొడి 1 చెంచా
  13. మిరియాలపొడి 1 చెంచా
  14. నిమ్మరసం 1 చెంచా
  15. టమాటో కెచప్
  16. గ్రేటెడ్ మోజేరిల్లా చీజ్ 1 కప్(తప్పనిసరి కాదు)
  17. మయోనిజ్( తప్పనిసరి కాదు)

సూచనలు

  1. ఉడికకించి తొక్క తీసిన ఆలూ, ఉల్లితరుగు, టమాట ముక్కలు తయారు చేసుకోండి.
  2. కడిగిన పుదీనా, కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు,కొంచెం నిమ్మరసం తో మిక్సీ చేసుకోండి.
  3. ఆలూ, టమాట, ఉల్లి,ఉప్పు కారం,గరం మసాలా, అల్లంవెల్లుల్లి, గరం మసాలా, చాట్ మసాలా,మిరియాల పొడి నిమ్మరసంను కలపండి.
  4. బ్రెడ్ తీసుకొని కటోరా తో రౌండ్ గా కట్ చేసుకోండి..లేదా అలాగే వుంచి కూడా చేయండి.
  5. ఒక బ్రెడ్ కు గ్రీన్ పేస్ట్, వేరే దానికి టమాటో కెచప్ రాసి పెట్టండి.
  6. ఇప్పుడు ఒక దానిపై ఆలూ మిశ్రమాన్ని పెట్టి మూయండి.(చీజ్ వొద్దు అనుకుంటే)
  7. పెనం పొయ్యి పై పెట్టి బట్టర్ వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి చల్లాగా అయ్యాక డబ్బాలో పెట్టండి.
  8. ఇంట్లో మాయో, ఇంకా చీజ్ రెడీగా వుంటే కూర పై గ్రేట్ చేసి కూడా శాండ్విచ్ చేయొచ్చు. ఒకటి చేసాను చూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర