మాసాల బాత్ | Masala bath Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala bath recipe in Telugu,మాసాల బాత్, Sree Vaishnavi
మాసాల బాత్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మాసాల బాత్ వంటకం

మాసాల బాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala bath Recipe in Telugu )

  • తరిగిన క్యారెట్ 1/4 కప్
  • తరిగిన టమాటో 1/4 కప్
  • తరిగిన పచ్చిమిర్చి 1-2
  • బంగాళాదుంప 1/4 కప్
  • బఠాణి 1/4 కప్
  • లవంగం 1-2
  • దాల్చిన చెక్క 1 అంగుళం
  • అల్లం 1 చెంచా
  • నీళ్లు 3 గ్లాసులు
  • కరివేపాకు 1 రెమ్మ
  • బొంబాయి రవ్వ 2 గ్లాసులు
  • ఉప్పు తగినంత
  • ఉల్లిపాయ తరిగినది 1
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • నూనె 2 చెంచాలు

మాసాల బాత్ | How to make Masala bath Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో లవంగం దాల్చినచెక్క వేసుకోవాలి
  3. అవి వేగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  5. అందులో బంగాళాదుంప ,బఠాణి వేసి వేయించి నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి
  6. నీళ్లలో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  7. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి అందులో రవ్వ కలుపుతూ వేసుకోవాలి
  8. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే

Reviews for Masala bath Recipe in Telugu (0)