హోమ్ / వంటకాలు / అటుకుల ఉప్మా

Photo of Poha upma by aarogyamastu telugu videos at BetterButter
2038
2
0.0(0)
0

అటుకుల ఉప్మా

Dec-01-2018
aarogyamastu telugu videos
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 2cups
  2. పచ్చిమిర్చి 7
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్
  5. ఆవాలు-ఒక టేబుల్ స్పూన్
  6. మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్
  7. కర్వేపాకు కొంచెం
  8. జీడిపప్పు ఆరు
  9. కొత్తిమీర కొంచెం
  10. సాల్ట్ తగినంత
  11. పసుపు one tablespoon
  12. ఎండుమిర్చి 4
  13. నిమ్మకాయ 1
  14. అల్లము కొంచెం

సూచనలు

  1. అటుకులు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి
  2. ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి
  3. ఒక బండి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. (పచ్చి పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర)
  4. తరువాత జీడిపప్పు కూడా వేసుకోవాలి
  5. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో బాగా వేయించుకోవాలి.
  6. తరువాత నిలువుగా కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి.
  7. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
  8. అలా వేగిన తరువాత అల్లంముక్కలు కూడా వేసుకోవాలి.
  9. తరువాత కరివేపాకు పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  10. ముందుగా మనము కడిగి పెట్టుకున్న అటుకుల్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  11. మిస్ చేసుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
  12. తరువాత ఒక చెక్క నిమ్మకాయ పిండాలి.
  13. నిమ్మకాయ పిండిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ అటుకుల ఉప్మా తయారీ అయిపోయింది ఎంజాయ్ చేయండి.
  14. ఎంతో రుచికరంగా హెల్తీ గా ఉండే అడుగులు ఉప్మా తయారీ అయిపోయింది ఫ్రెండ్స్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర