హోమ్ / వంటకాలు / Mozorella stuffed Mirch bajjiya

Photo of Mozorella stuffed Mirch bajjiya  by Shobha.. Vrudhulla at BetterButter
818
4
0.0(1)
0

Mozorella stuffed Mirch bajjiya

Dec-10-2018
Shobha.. Vrudhulla
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్ద మిరపకాయలు 9
  2. స్టఫింగ్ కోసము పదార్ధాలు :
  3. మోజారెల్లా చీజ్ 200 గ్రామ్స్
  4. ఉల్లిపాయ 1
  5. శిమ్లా మిర్చి 1/2 కప్ కట్ చేసినది
  6. స్వీట్ కార్న్ 1/4 కప్
  7. వెల్లుల్లి వలిచి చిన్న ముక్కలుగా కట్ చేసినవి 1 చంచాడు
  8. పచ్చి మిర్చి 2 చిన్న ముక్కలుగా తరిగినవి
  9. టమాట 1 గుజ్జు లేకుండా తిరిగింది
  10. ఉప్పు తగినంత
  11. చిల్లీ ఫ్లెక్స్ 3 చంచాలు
  12. ఒరిగానో కొంచెం
  13. మైదా 2 కప్పులు
  14. ఉప్పు తగినంత
  15. చిల్లీ ఫ్లెక్స్ 1 చంచా
  16. 6 బ్రెడ్ స్లైసెస్ మిక్సీ లో పొడి చేసి పెట్టుకోవలెను
  17. డీప్ ఫ్రై కోసము నూనె

సూచనలు

  1. ముందుగా మిరప కాయలకి బాగా కడిగి తుడిచి మధ్య భాగంలో కట్ చేసి లోపల గింజలు అన్ని తీసి పక్కన పెట్టుకోండి
  2. ఆ తరువాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో 2 చెంచాల నూనె వేసి వేగనివ్వాలి
  3. వేడి అయ్యాక నూనెలో ముందుగా వెల్లుల్లి వేసి 20 సెకెండ్స్ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  4. ఇప్పుడు అందులో 3 రకాల సిమ్లా మిర్చి ముక్కలు వేసి కాస్త వేగా నివ్వాలి . అవి కూడా వేగాక స్వీట్ కార్న్ కూడా వేసి వేగాక కిందకి దించి చిల్లర నివ్వాలి.
  5. ఇప్పుడు చీజ్ ని గ్రేట్ చేసి అందులో వేయించి ఉంచిన పదార్ధాలు వేయాలి
  6. స్టఫింగ్ కోసం పైన చెప్పిన అన్నీ పదార్ధాలు తురిమిన చీజ్ లో వేసుకొని ముద్దగా అవకుండా చూసుకుంటూ కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఈ కలిపిన చీజ్ ని మిరపకాయల్లో బాగా కూరుకొని సిద్ధం చేసుకోవాలి
  8. స్టవ్ మీద నూనె పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఈ లోపు కవరింగ్ కోసం పేస్ట్ తయారు చేసుకోవాలి
  9. ఒక వెడల్పాటి బౌల్ లో మైదా, ఉప్పు, చిల్లి ఫ్లెక్స్ వేసి ఉండలు లేకుండా , మరీ జారుడుగా కాకుండా కాస్త చిక్కగా కలుపుకోవాలి
  10. చేసి నింపుకున్న మిరపకాయల్ని ముందుగా మైదా పేస్ట్ లో ముంచి తీసి తరువాత బ్రెడ్ పొడిలో దొర్లించి వేడి నూనెలో వేసి ఒక్కొక్కటి చొప్పున వేయించుకొని తీసుకోవాలి
  11. ఇలాగే అన్ని వేయించి పెట్టుకోవాలి
  12. మీకు నచ్చిన విధంగా అలంకరించుకొని సర్వ్ చేసుకోండి . అంతే ఎంతో రుచికరమైన చీజ్ స్టఫింగ్ తో మిర్చి భజియా రెడీ .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Anitha Rani
Dec-14-2018
Anitha Rani   Dec-14-2018

V.nice shobha

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర