హోమ్ / వంటకాలు / నారింజకాయ పులిహోర

Photo of Orange pulihora by Kiran Gopisetti at BetterButter
1360
2
0.0(0)
0

నారింజకాయ పులిహోర

Mar-06-2019
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నారింజకాయ పులిహోర రెసిపీ గురించి

నారింజకాయ పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం 1 గ్లాస్
  2. నారింజకాయలు 2
  3. నూనె 100 గ్రామ్స్
  4. జీడిపప్పు 10
  5. చెనక్కాయ పప్పు 4 స్పూన్స్
  6. పచ్చి పప్పు 1స్పూన్
  7. సాయి మినపప్పు 1స్పూన్
  8. ఆవాలు 1స్పూన్
  9. జీలకర్ర 1స్పూన్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఉప్పు 1 1/2 స్పూన్
  12. పచ్చిమిర్చి 4
  13. ఎండుమిర్చి 4
  14. కరివేపాకు
  15. కొత్తిమీర
  16. ఇంగువ 1/2 స్పూన్
  17. క్యారెట్ తురుము కొంచెం

సూచనలు

  1. 1 గ్లాస్ బియ్యం కడిగి 2 గ్లాసుల నీరు పోసి పొయ్యిమీద పెట్టి ఉడికించాలి.
  2. అన్నం రెడీ అయ్యే లోపు నారింజకాయ రసం తీసుకోవాలి.
  3. అన్నం అవగానే ప్లేట్ లో తీసుకుని ఆరపెట్టి నారింజ రసంలో ఉప్పు వేసి కలిపి అన్నానికి పట్టించాలి
  4. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత చెనక్కాయ పప్పు, పచ్చి పప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒకటి తరువాత ఒకటి వేసి వేయించాలి
  5. అవి వేగిన తరువాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర వేసి వేయించి
  6. చివర్లో పసుపు, ఇంగువ వేసి వేగిన తరువాత అన్నo లో వేసి కలిపి కొంచెం క్యారెట్ తురుము వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర