బియ్యపు రవ్వ ఉప్మా | Rice flour upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rice flour upma recipe in Telugu,బియ్యపు రవ్వ ఉప్మా, Tejaswi Yalamanchi
బియ్యపు రవ్వ ఉప్మాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బియ్యపు రవ్వ ఉప్మా వంటకం

బియ్యపు రవ్వ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour upma Recipe in Telugu )

  • బియ్యపు రవ్వ 1 కప్పు
  • ఉలిపాయ -1 ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  • పచ్చి మిరపకాయలు -1 ముక్కలుగా తరిగినవి
  • నూనె : సరిపడ
  • ఉప్పు : రుచికి సరిపడ
  • మిన పప్పు : 1 టీస్పూన్
  • నీళ్ళు : 1.5 కప్పు
  • ఆవాలు : 1 టీస్పూన్

బియ్యపు రవ్వ ఉప్మా | How to make Rice flour upma Recipe in Telugu

  1. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు ,మినపప్పు వేసి వేయించండి
  2. దానిలో ఉలిపాయ , మిరపకాయ ముక్కలు వేసి వేయించండి
  3. తరవాత నీళ్లు పోసి దానిలో సరిపడ ఉప్పు వేసి నీటిని మరిగించండి. ఆ తరువాత బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా కలపండి.
  4. సన్నని మంట మీద ఉడికించుకోండి.
  5. నీరు ఇంకిన తర్వాత మధ్య మధ్య లో కలుపుతూ పూర్తిగా ఉడకనివ్వండి.
  6. ఉడికిన తర్వాత పొడి పొడి గా మారుతుంది. పూర్తి సమయం చిన్నని మంట పైన ఉడికించండి.
  7. దీనితో మన బియ్యపు రవ్వ ఉప్మా తయారు. రుచి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తప్పక చేసుకుంటారు.

నా చిట్కా:

ఒక కప్పు నీళ్లలో లో ఒక కప్పు బియ్యం పిండి వేసి,ఒక సీటీ వచ్చే వరకు ప్రెషర్ కుక్కరు లో ఉడికించి చల్లార్చిన తర్వాత తాలింపు పెట్టుకొని కలిపి వినియోగించవచ్చును.

Reviews for Rice flour upma Recipe in Telugu (0)