దోస పిండి తో పూర్ణాలు | Poornam burelu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poornam burelu recipe in Telugu,దోస పిండి తో పూర్ణాలు, Tejaswi Yalamanchi
దోస పిండి తో పూర్ణాలుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    4

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

దోస పిండి తో పూర్ణాలు వంటకం

దోస పిండి తో పూర్ణాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poornam burelu Recipe in Telugu )

  • బియ్యం 1 1/4 కప్పు
  • మినపప్పు 3/4 కప్పు
  • బెల్లం 1 1/2 కప్పు తురిమినది
  • ఉడికించిన సెనగ పప్పు 1 కప్పు
  • చిటికెడు ఉప్పు
  • నూనె : వేయించడానికి సరిపడ

దోస పిండి తో పూర్ణాలు | How to make Poornam burelu Recipe in Telugu

  1. ముందుగా బియ్యం,మినపప్పు 4 గంటలు నానపెట్టి గట్టిగా రుబ్బుకోండి. ఆ తరువాత ఒక చిటికెడు ఉప్పు వేసి కలుపుకోండి.
  2. ఉడికించిన సెనగ పప్పు లో వేడి మీద తురిమిన బెల్లం కలుపుకోండి.
  3. పప్పు బెల్లం మిశ్రమం కాస్త చల్లారిన తరువాత ఉండలు గా చేసుకోండి.
  4. ఇప్పుడు వేయించటానికి ఒక బాండీ లో నూనె పోసి వేడి చేసుకోండి.
  5. నూనె వేడెక్కిన తర్వాత బెల్లం పప్పు ఉండని మినపిండి మిశ్రమo లో ముంచి అన్ని వైపులు పిండి ఆంటీన తర్వాత వేడి నూనెలో వేసి దోరగా వేయించుకోండి.
  6. వేయించిన తర్వాత ఒక ప్లేటులోకి తీసుకొని వడ్డించుకోండి.
  7. ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు తినటానికి రెడి. మీరు ఈ పండుగకి చేసుకొని ఆనందండించండి.

నా చిట్కా:

పప్పు బెల్లం మిశ్రమం లో ఉండలు రాకుండా ఉండాలంటే కాస్త సెనెగ పిండి కలుపుకోండి.
View More

Reviews for Poornam burelu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo