పొరలు పరోట | LAYERED parota Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • LAYERED parota recipe in Telugu,పొరలు పరోట, Tejaswi Yalamanchi
పొరలు పరోటby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

4

0

పొరలు పరోట వంటకం

పొరలు పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make LAYERED parota Recipe in Telugu )

  • మైదా పిండి : 3 కప్పులు
  • ఉప్పు : తగినంత
  • చెక్కెర : 1 స్పూన్
  • నూనె లేదా నెయ్యి : ఒక టీస్పూన్
  • నీళ్లు పిండి కలుపుకోవటానికి సరిపడ

పొరలు పరోట | How to make LAYERED parota Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు మరియు చెక్కర వేసి కలపండి. ఆ పైన ఒక స్పూన్ నూనె వేసి లేదా నెయ్యివేసి సరిపడినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా కలపండి
  2. ఇప్పుడు ఆ పిండిని ఒక చపాతీ గా గుండ్రముగా తాల్చు కొండి
  3. చేసిన చపాతీని కత్తితో బారుగా పొడుగ్గా గా కట్ చేసుకోండి
  4. కట్ చేసిన ముక్కల్ని ఒకదానిపైన ఒకటి పట్టండి
  5. దాన్ని మళ్లీ ఉండలాగా చుట్టుకోండి
  6. ఇప్పుడు మళ్లీ దాన్ని చపాతీలా చేసుకోండి
  7. ఒక పాన్ పెట్టి వేడెక్కాక చపాతీని కాల్చుకోండి
  8. కాలిన చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకుని చేతులతో బాగా నల పండి
  9. అప్పుడు అది పొరలు పొరలుగా కనిపిస్తూ నోరు ఊరిస్తుంది
  10. పొరల పరొట్టా రెడీ మీరు చేసుకొని సాలన్ లేదా కూర తో ఆనందించండి.

Reviews for LAYERED parota Recipe in Telugu (0)