దోసకాయ పప్పు | CUCUMBER/dosakaya pappu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CUCUMBER/dosakaya pappu recipe in Telugu,దోసకాయ పప్పు, Tejaswi Yalamanchi
దోసకాయ పప్పుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

దోసకాయ పప్పు వంటకం

దోసకాయ పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CUCUMBER/dosakaya pappu Recipe in Telugu )

  • చిన్న దోసకాయ 1
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 2
  • ఒక స్పూన్ ఆవాలు
  • ఒక స్పూన్ జీలకర్ర
  • కంది పప్పు పావు కిలో
  • ఉప్పు ఒకటిన్నర స్పూన్
  • కారం ఒక స్పూన్
  • నూనె 2 స్పూన్లు
  • కర్వేపాకు

దోసకాయ పప్పు | How to make CUCUMBER/dosakaya pappu Recipe in Telugu

  1. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు ను కడిగి ఉంచుకోవాలి
  2. దోసకాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  3. ఉల్లిపాయ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  4. ఇప్పుడు కుకర్లో దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయండి
  5. ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోండి
  6. ఉడికిన పప్పును తీసుకుని మెత్తగా మెదుపు కొండి
  7. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి అది కాగాక జీలకర్ర ఆవాలు వేయండి
  8. ఆ నూనెని మెదిపిన పప్పు లో వేయండి
  9. ఇప్పుడు మళ్లీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసి ఈ పప్పును దానిమీద పెట్టండి.ఇప్పుడు ఉప్పు కారం కరివేపాకు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి

Reviews for CUCUMBER/dosakaya pappu Recipe in Telugu (0)