హోమ్ / వంటకాలు / అరటి దూట ఆవ పెట్టిన

Photo of Banana stem curry by Sree Sadhu at BetterButter
870
6
0.0(0)
0

అరటి దూట ఆవ పెట్టిన

May-02-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి దూట ఆవ పెట్టిన రెసిపీ గురించి

అరటి దూట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరి అలాంటి అరటి దూటని ఆవపొడి తో చేసుకుంటే పిన్న పెద్ద చాల ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. అరటి దూట : 250 గ్రాములు
  2. పచ్చిమిర్చి : 3
  3. కరివేపాకు : 1 రెమ్మ
  4. పసుపు : 1/4 చెంచాడు
  5. మజ్జిగ : 1 కప్పు
  6. ఉప్పు : రుచికి సరిపడా
  7. అల్లం ముక్కలు 1 చెంచా
  8. శనగపప్పు 1 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. పల్లీలు 2 చెంచలు
  11. ఆవ : 2 చెంచాలు
  12. ఆవ : 2 చెంచాలు

సూచనలు

  1. కూర మొదలు పెట్టె ముందు ఆవ సిద్ధం చేసుకోండి. అందు కొరకు ఆవాలు, నువ్వులు మరియు బియ్యాన్ని సమ పాలల్లో తీసుకొని సరి పడి నన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దను రుబ్బి పెట్టుకోండి.
  2. ముందుగా అరటిదూటనుశుభ్రం గా కడిగి తుడిచి , గుండ్రం గా తరగండి. ఆ తరువాత మధ్య లో వచ్చిన నారను తీసివేసి , సన్నగా మరియు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
  3. ఈ ముక్కలను మజ్జిగలో వేసి కొద్దిసేపు ఉంచాలి .
  4. అరటిదూట ముక్కలను ఒక బాణిలో వేసి సరి పడా నీళ్లు పోసి ఉడికించండి.
  5. దూత ముక్కలు ఉడికిన తరువాత చిల్లుల పళ్లెం లో పోసి చల్లార బెట్టుకొండి .
  6. పచ్చిమిర్చిని చీలికలుగా మరియు అల్లం ముక్కలు గా తరుగుకొండి .
  7. స్టవ్ వెలిగించి బాణి పెట్టి వేడెక్కాక సరిపడా నూనె వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి,  అవి దోరగా వేగిన తరువాత , కరివేపాకు , పచ్చిమిర్చి చీలికలు ,అల్లం ముక్కలు వేసి ఇవి కూడా దోరగా వేయించండి.
  8. ఉడికించి చల్లారబెట్టుకున్న అరటిదూట ,పసుపు , ఉప్పు వేసి బాగా కలపండి
  9. కొద్దిసేపు మగ్గనిచ్చి తడి పోయేంత వరకు ఉంచి స్టవ్ ఆపివేసి రుబ్బి పెట్టుకున్న ఆవముద్దవేసి బాగాకలుపుకొండి .
  10. అరటిదూట అవా పెట్టిన కూర రెడీ. ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర