కంద బచ్చలి | Yam curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yam curry recipe in Telugu,కంద బచ్చలి, Sree Vaishnavi
కంద బచ్చలిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    18

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

1

కంద బచ్చలి వంటకం

కంద బచ్చలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yam curry Recipe in Telugu )

  • కంద - 350గ్రా
  • బచ్చలి కూర ఆకులు- 120గ్రా
  • పచ్చిమిరప - 6
  • అల్లం - 1/4 ముక్క
  • చింతపండు - ఉసిరికాయంత సైజులో
  • పసుపు - 1/8 చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • శనగపప్పు 2 చెంచా
  • మినపప్పు- 2 చెంచా
  • ఆవాలు - 1 చెంచా
  • మిరపకాయలు - 2
  • ఆవాలు-3/4 చెంచా
  • జిలకర - 3/4 చెంచా

కంద బచ్చలి | How to make Yam curry Recipe in Telugu

  1. ముందుగా కందదుంప పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి.
  2. బచ్చలి కూరని కడిగి సన్నగా తరగాలి.
  3. పచ్చిమిర్చి ని నిలువుగా చీల్చుకొని వుంచుకోవాలి .
  4. కందముక్కలు బచ్చలి కలిపి పసుపు వేసి వుడించుకొని వుంచుకోవాలి
  5. బాండిలో నూనె వేసుకొని వేడి చేసి
  6. అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇంగువ అల్లం పచ్చిమిర్చి కరివెపాకు ఎండు మిర్చి వేసుకొని వేయించాలి
  7. ఇప్పుడు ఇందులో ముందుగా వుడికించుకున్న కంద బచ్చలి వేసుకొని
  8. దానికి చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకొని
  9. తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి 2 నిముషములు తరువాత స్టవ్ ఆపివేసుకోవాలి.
  10. చల్లారాక 2 చెంచాల ఆవ పిండి కలిపితే ఎంతో రుచికరమైన కందాబచ్చలి కూర రడీ.

నా చిట్కా:

చల్లారాక ఆవ పిండి కలిపితే ఎంతో రుచికరము.

Reviews for Yam curry Recipe in Telugu (1)

Revathi Kumari5 months ago

woooooooooow
జవాబు వ్రాయండి