హోమ్ / వంటకాలు / వంకాయ బఠాణి కూర

Photo of Brinjal peas curry by Sree Sadhu at BetterButter
505
6
0.0(0)
0

వంకాయ బఠాణి కూర

May-03-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ బఠాణి కూర రెసిపీ గురించి

వంకాయ బఠాణి కూర చాలా రుచిగా వుంటుంది. ఈకూరను సాదారణంగా విందు బోజనాలకు తయారుచెస్తారు . అన్నం లేదా రోటీతో తినవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు పావుకిలో
  2. పచ్చి బఠాణీలు 1కప్పు
  3. బీన్స్ ముక్కలు 1 కప్పు
  4. పచ్చిమిర్చి 3
  5.  అల్లం అంగుళం ముక్క
  6. వెల్లుల్లి రెబ్బలు 4
  7. దనియాలపొడి: 2 టేబుల్‌స్పూన్లు
  8. కారం 1 టీస్పూను
  9. ఉప్పు: తగినంత
  10. కొత్తిమీర తురుము 1టేబుల్‌స్పూను
  11. తాలింపుకోసం: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు , మినప్పప్పు,ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు
  12. వేయించిన గుమ్మడి వడియాలు

సూచనలు

  1. ఎండు బఠాణీలయితే రాత్రే నానబెట్టుకుని కుక్కర్‌లో ఉడికించి ఉంచాలి.
  2. అల్లంవెల్లుల్లి ముద్దలా చేయాలి. పచ్చిమిర్చి కూడా ముద్దలా చేయాలి.
  3. బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక అల్లంవెల్లుల్లివేయాలి.
  4. తరవాత పచ్చిమిర్చి ముద్ద, బఠాణీలు ,బీన్స్ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాక కొద్దిగా నీళ్లుచిలకరించి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి.
  5. వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి. చివరగా దనియాలపొడి, కారం, ఉప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర తురుమువేసి ఉడికించి దించాలి. 
  6. వేయించిన గుమ్మడి వడియాలు కూడా వేసుకొని బాగ కలిపి.
  7. స్టవ్ ఆపివేసుకుంటె వంకాయ బఠాణి కూర రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర