గంగావాయిలు మామిడికాయ పప్పు కూర | Gangavalli mango dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gangavalli mango dal recipe in Telugu,గంగావాయిలు మామిడికాయ పప్పు కూర, Sree Vaishnavi
గంగావాయిలు మామిడికాయ పప్పు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

గంగావాయిలు మామిడికాయ పప్పు కూర వంటకం

గంగావాయిలు మామిడికాయ పప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gangavalli mango dal Recipe in Telugu )

  • ఒక కప్పు కందిపప్పు
  • ఒక కట్ట గంగవాయిలు ఆకుకూర
  • రెండు పచ్చి మామిడికాయలు
  • నాలుగు పచ్చిమిరపకాయలు
  • ఒక్కటి టమటా
  • రెండు టీస్పూన్లు నెయ్యి
  • తగినంత‌ ఉప్పు
  • పోపుకు సరిపడా‌ జీలకర్ర, ఆవాలు, మెంతులు
  • అర టీస్పూను‌ పసుపు

గంగావాయిలు మామిడికాయ పప్పు కూర | How to make Gangavalli mango dal Recipe in Telugu

  1. ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి.
  2. కందిపప్పును కూడా శుబ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకొని ఉండికించుకోవాలి. ఇందులోనే టమటా, పచ్చిమిర్చిని కూడా నిలువున కట్ చేసి, విటితో పాటె పసుపు వేసి ఉడికించుకొవాలి.
  3. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి, నెయ్యి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి.
  4. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి ముందుగా ఉండికించుకున్నకంది పప్పును వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కాసెపు ఉడికించి క్రిందకు దింపాలి. అంతే గంగవల్లి మామిడికాయ పప్పు రెడీ.

Reviews for Gangavalli mango dal Recipe in Telugu (0)