క్యాప్సికం వేపుడు | Capsicum fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  9th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum fry recipe in Telugu,క్యాప్సికం వేపుడు, Tejaswi Yalamanchi
క్యాప్సికం వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

క్యాప్సికం వేపుడు వంటకం

క్యాప్సికం వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum fry Recipe in Telugu )

  • క్యాప్సికమ్/ సిమ్లా మిర్చి 3
  • వేయించిన శెనిగ పిండి 1/8 కప్పు
  • జీలకర్ర 1/4 చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు 7
  • వేయించిన ఎండు మిరపకాయలు ఆరు
  • ఉప్పు 1 చెంచా
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • పచ్చి శనగపప్పు 1/4 చెంచా
  • మినప్పప్పు 1/4 చెంచా
  • నూనె 7 చంచాలు
  • తరిగిన కొత్తిమీర 2 చెంచాలు

క్యాప్సికం వేపుడు | How to make Capsicum fry Recipe in Telugu

  1. ముందుగా మూడు క్యాప్సికమ్లను తీసుకోండి
  2. క్యాప్సికంను కడిగి ముక్కలుగా తిరగండి
  3. ఒక మిక్సీ జార్లో వేయించిన శనగపప్పు, జీలకర్ర ,ఎండు మిరపకాయలు ,వెల్లుల్లి రెబ్బలు వేయండి
  4. పై వాటిని మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి
  5. పొయ్యి మీద ఒక బాండీ పెట్టి, వేడయ్యాక దాంట్లో నూనె పోసి కాగనివ్వాలి
  6. నూనె కాగాక దాంట్లో ఆవాలు , జీలకర్ర , మినప్పప్పు , శెనగపప్పు వేసి వేయించండి
  7. పైవి వేగాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కలిపి వేయించండి
  8. మూతపెట్టి క్యాప్సికమ్ ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వండి
  9. మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి
  10. క్యాప్సికం మెత్తబడ్డాక దాంట్లో తయారు చేసుకున్న పొడి వేసుకోండి
  11. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొండి
  12. మొత్తం కలిపి పొడి కాస్త ఎర్రగా అయ్యాదాకా వేయించుకోండి
  13. పొడి కాస్త ఎర్రగా అయ్యాక చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుని దించేయాలి. కాప్సికం శెనెగె పిండి కూర రెడీ.

Reviews for Capsicum fry Recipe in Telugu (0)