హోమ్ / వంటకాలు / బంగాళా డుంప వంకాయా కూర

Photo of Aloo brinjal curry by Ram Ram at BetterButter
661
2
0.0(0)
0

బంగాళా డుంప వంకాయా కూర

May-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళా డుంప వంకాయా కూర రెసిపీ గురించి

వంకాయలంటే మనలో చాలా మంది కి ఎంతో ప్రీతికరం మరి అలాంటి వంకాయలు బంగాళా దుంపలు జోడించి చేసుకొనే ఈ కూర పిన్న పెద్ద అందరూ ఇష్టపడి తింటారు. ఇది చేసుకోవటం ఎంతో సులువు అలాగే ఇది అన్నం తో పాటు చపాతీ లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళా దుంపలు : 1/4 కేజీ
  2. వంకాయలు : 1/4 కేజీ
  3. ఉల్లిపాయలు : రెండు, మధ్యరకం
  4. మసాలా కోసం: 1స్పూన్ : గసగసాలు, 1స్పూన్ : ధనియాలు, చిన్న ముక్క : దాల్చిన చెక్క, 1 స్పూన్ : అల్లం వెల్లుల్లి ముద్ద , 2 : లవంగాలు, 2 స్పూన్ల్ : ఎండు కొబ్బరి
  5. ఉప్పు : రుచికి సరిపడా
  6. ఎండు కారం: 1స్పూన్
  7. పసుపు : 1/2స్పూన్
  8. నూనె : 6స్ఫూన్లు
  9. కొత్తిమీరు : కొద్దిగా
  10. నీళ్లు : 1 కప్పు

సూచనలు

  1. కూర చేసుకోవటం మొదలు పెట్టె ముందు మసాలా పేస్టుని తయారు చేసుకుందాం. అందుకని మసాలా పేస్టుకి కావాల్సిన 1స్పూన్ : గసగసాలు, 1స్పూన్ : ధనియాలు, చిన్న ముక్క : దాల్చిన చెక్క, 1 స్పూన్ : అల్లం వెల్లుల్లి ముద్ద , 2 : లవంగాలు, 2 స్పూన్ల్ : ఎండు కొబ్బరి వేసి సరిపడ నీళ్లు పోసి ముద్దలా చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి వేడి అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  2. తరువాత బంగాళా దుంప ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత వంకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  3. తరువాత పసుపు, కారం, ఉప్పు, రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దని వేసి మరికొద్ది సేపు మగ్గనిచ్చి నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి.
  4. కూర దెగ్గరపడి పూర్తిగా ఉడికిన తరువాత తరిగిన కొత్తిమీర వేసుకోని స్టవ్ ఆపుకోండి.
  5. ఎంతో రుచిగా ఉండే వంకాయ బంగాళా దుంప కూర రెడి. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర