కాప్సికం పల్లి పొడి కూర | Capsicum peanut powder curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum peanut powder curry recipe in Telugu,కాప్సికం పల్లి పొడి కూర, Sree Vaishnavi
కాప్సికం పల్లి పొడి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కాప్సికం పల్లి పొడి కూర వంటకం

కాప్సికం పల్లి పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum peanut powder curry Recipe in Telugu )

  • కాప్సికం 1/2 కేజీ
  • ఉల్లిపాయ 2
  • పల్లీలు 1 కప్
  • ఎండుమిరపకాయలు 8
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర 1/2 చెంచా
  • వెల్లులి రెబ్బలు 2
  • నూనె 4 చెంచాలు

కాప్సికం పల్లి పొడి కూర | How to make Capsicum peanut powder curry Recipe in Telugu

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఉల్లిపాయ ని కూడా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లులి రెబ్బలు ,జీలకర్ర వేసి వేయించి ఉప్పు ఏసుకొని పొడి చేసుకోవాలి .
  4. ఇప్పుడు మరో ఒక బాణీ పెట్టి అందులో నూనె, జీలకర్ర వేసి వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ మరియు కాప్సికం ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  6. అది వేగిన తరువాత అందులో పల్లి పొడి వేసి మరో ఐదు నిముషాలు వేయించడమే అంతే .
  7. అతి సులువైన కాప్సికం పల్లి పొడి కూర రెడీ. చేసుకొని వేడి వేడి అన్నం తో సంతృప్తిచెందండి.

నా చిట్కా:

పల్లి పొడి లో నచ్చితే కొబ్బరి తురుము నువ్వులు కూడా వేసుకోవచ్చు

Reviews for Capsicum peanut powder curry Recipe in Telugu (0)