చానా మీల్ మేకర్ కూర | Chana meal maker curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chana meal maker curry recipe in Telugu,చానా మీల్ మేకర్ కూర, Sree Vaishnavi
చానా మీల్ మేకర్ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    24

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

చానా మీల్ మేకర్ కూర వంటకం

చానా మీల్ మేకర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana meal maker curry Recipe in Telugu )

  • సెనగలు 1 1/2 కప్పు
  • మీల్ మేకర్ 1 కప్పు
  • ఉల్లిపాయ 2
  • పచ్చిమిర్చి 2
  • టమాటాలు 3
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • నీళ్లు తగినంత

చానా మీల్ మేకర్ కూర | How to make Chana meal maker curry Recipe in Telugu

  1. ముందుగా సెనగలని 6 నుండి 8 ఘంటల పాటు సరిపడినన్ని నీళ్లు పోసి నానా బెట్టుకోవాలి
  2. వాటిని ఒక కుక్కర్ తీసుకొని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి
  3. మీల్ మేకర్ కూడా ఉడికించుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి అల్లం వెల్లులి పేస్ట్ , తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. అది వేగిన తరువాత టమాటా వేసి మగ్గనివ్వాలి
  6. మగ్గిన తరువాత ఉప్పు , కారం , గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో ఉడికిన సెనగలు మెల్ మేకర్ నీళ్లు పోసి మరో పది నిముషాలు ఉడికించాలి అంతే
  8. ఎంతో రుచికరమైన మెయిల్ మేకర్ చానా కర్రీ రెడీ. చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

సెనగలు ఉడికేటప్పుడు టీ బాగ్ వేస్తే బాగా ఉడుకుతాయి మరియు మంచి రంగు వస్తాయి.

Reviews for Chana meal maker curry Recipe in Telugu (0)