రొయ్యల వేపుడు | Frawns fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Frawns fry recipe in Telugu,రొయ్యల వేపుడు, Tejaswi Yalamanchi
రొయ్యల వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

రొయ్యల వేపుడు వంటకం

రొయ్యల వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Frawns fry Recipe in Telugu )

  • రొయ్యలు 1 కిలో
  • నూనె 8 చెంచాలు
  • పావు కిలో పచ్చికొబ్బరి
  • పావులో సగం అల్లం ముక్క
  • దాల్చిన చెక్క 1
  • లవంగాలు 4
  • వెల్లుల్లి 8 రెబ్బలు
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిరపకాయలు 2
  • ఉప్పు 2 చెంచాలు
  • కారం 3 చెంచాలు
  • పసుపు 1/4 చెంచా
  • పెరుగు 3 చెంచాలు
  • కొత్తిమీర 2 చెంచాలు తరిగినది

రొయ్యల వేపుడు | How to make Frawns fry Recipe in Telugu

  1. ముందుగా రొయ్యల్ని బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో పెరుగు పసుపు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి .
  2. ఉల్లిపాయ మరియు పచ్చి మిరపకాయలు ముక్కలు గా తరుగుకోండి .
  3. అల్లం వెల్లుల్లి , కొబ్బరి ,దాల్చిన చక్కా ,లవంగం మిక్సీ లో వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలా చేసుకోండి .
  4. రొయ్యల నుండి నీరు బాగ నీరు వదులుతాయి . సగం వరకు నీరు ఇంకి పోయేదాకా ఉడికించండి.
  5. ఆ తరవాత ఒక బాణీ పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది కాగాక మనం బాగా ఉడికించిన రొయ్యలు వేసి వేయించండి.
  6. రొయ్యలు వేగాక దాంట్లో మనం ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలని కూడా వేసి వేయించండి.
  7. మనం ముందుగా రెడీ చేసుకుని పేస్ట్ ను ఉల్లిపాయముక్కలు అవి వేగాక దాంట్లో వేసి బాగా కలుపుకొని వేగనివ్వండి
  8. మనం వేయకున్న పేస్ట్ బాగా వేగిపోయి ఎర్రగా తయారవుతుంది అప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకుని దించేయండి అంతే రొయ్యల వేపుడు తయారు

Reviews for Frawns fry Recipe in Telugu (0)