సొరకాయ కూర | Bottle gourd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle gourd curry recipe in Telugu,సొరకాయ కూర, Sree Vaishnavi
సొరకాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సొరకాయ కూర వంటకం

సొరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd curry Recipe in Telugu )

  • సొరకాయ : 1 మధ్యరకం
  • పచ్చిమిర్చి : 3 తరిగినవి
  • కరివేపాకు : 1 రెమ్మ
  • ఎండుమిరపకాయ : 1
  • మినపప్పు : 1 చెంచా
  • ఆవాలు : 1 చెంచా
  • జీలకర్ర : 1 చెంచా
  • నూనె : 1 చెంచా
  • పసుపు : 1/4 చెంచా
  • ఉప్పు : తగినంత

సొరకాయ కూర | How to make Bottle gourd curry Recipe in Telugu

  1. సొరకాయని పొట్టు తీసి మరియు పచ్చి మిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోండి.
  2. బాండీ లో నూనె వేసి వేడిచేసుకొని మినపప్పు, ఆవాలు ,జీలకర్ర వేసుకొని చిటపట మన్నాక ఎండుమిర్చి వేసుకోండి.
  3. ఆ పైన పచ్చిమిర్చి ,కరివేపాకు ,పసుపు వేసి తరువాత సొరకాయ ముక్కలు వేసుకోండి .
  4. బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోండి.
  5. ముక్కలు ఉడికాక తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి .
  6. ముయెస్లీ మెర్రి పోయేవరకు ఉడికించుకుంటే సొరకాయ కూర రెడీ

నా చిట్కా:

కావాలనుకుంటే శనగపిండి 1 చెంచాడు వేసుకుంటే బాగుంటుంది .

Reviews for Bottle gourd curry Recipe in Telugu (0)