గుత్తి దొండకాయ కూర | Masala ivy gourd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala ivy gourd curry recipe in Telugu,గుత్తి దొండకాయ కూర, Sree Vaishnavi
గుత్తి దొండకాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

గుత్తి దొండకాయ కూర వంటకం

గుత్తి దొండకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala ivy gourd curry Recipe in Telugu )

  • దొండకాయ : 1/2 కేజీ
  • నూనె : 5 చెంచాలు
  • ఉల్లిపాయ : 2
  • కొబ్బరి తురిమినది : 1/2 కప్పు
  • పల్లీలు : 1/2 కప్పు
  • నువ్వులు : 1/2 కప్పు
  • ఎండుమిరపకాయలు : 4
  • జీలకర్ర : 1 చెంచా
  • కొత్తిమీర : 1/4 కప్పు
  • జీడిపప్పు: 5-6
  • బాదాం పప్పు : 3-6
  • ధనియాలు : 3 చెంచాలు
  • దాల్చినచెక్క : 1/2 అంగుళం ముక్క
  • ఉప్పు : తగినంత
  • ఎండు కారం : 2 చెంచాలు
  • చింతపండు : నిమ్మకాయ అంత
  • పంచదార : 1/4 చెంచా
  • పసుపు : 1/4 చెంచా
  • గరం మసాలా : 1 చెంచా

గుత్తి దొండకాయ కూర | How to make Masala ivy gourd curry Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలను కడిగి గుత్తిలా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఉప్పు, పసుపు, వేసి కలిపి గుత్తి లా తరిగిన దొండకాయలు వేసి ఉడికించాలి.
  3. ఇప్పుడు ఒక బాణీ లో నూనె వేసి వేడిఅయ్యాక ఉడికిన దొండకాయలు వేసి వేయించాలి.
  4. ఈలోపు మరో బాణీ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, బాదాం, కొబ్బరి, నువ్వులు,పల్లీలు,దాల్చినచెక్క,ఎండుమిర్చి ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  5. అవి చల్లారిన తరువాత రుచికి సరిపడ ఉప్పు మరియు తగినన్ని నీళ్లు పోసి ముద్ద లా చేసుకోవాలి.
  6. ఇప్పుడు వేగిన దొండకాయలు తీసి పక్కన పెట్టుకొని ఈ ముద్ద ను కురుకోవాలి.
  7. ఇప్పుడు మళ్ళి ఒక బాణీ పెట్టి నూనె వేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ వేసి వేయించి మిగిలిన ముద్ద వేసి నీళ్లు పోసి నూనె తేలే వరకు ఉడికించాలి.
  8. అందులో కొంచం పంచదార చింత పండు రసం వేయాలి.
  9. అందులో పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని మసాల నింపి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లుకుంటే అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి దొండకాయ రెడి.

నా చిట్కా:

తయారు చేసుకున్న పొడి కొంచెం ఉప్పు వేసుకొని అన్నం లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

Reviews for Masala ivy gourd curry Recipe in Telugu (0)