చింత చిగురు పప్పు కూర | chintha chiguru pappu kura Recipe in Telugu

ద్వారా Ram Ram  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  •  chintha chiguru pappu kura recipe in Telugu, చింత చిగురు పప్పు కూర, Ram Ram
చింత చిగురు పప్పు కూరby Ram Ram
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చింత చిగురు పప్పు కూర వంటకం

చింత చిగురు పప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make chintha chiguru pappu kura Recipe in Telugu )

  • కందిపప్పు : 1 కప్పు
  • చింత చిగురు : 1/2 కప్పు
  • ఎండు మిర్చి : 3
  • కరివేపాకు : ఒక రెమ్మ
  • ఆవాలు : 1 చెంచా
  • జీలకర్ర : 1/2 చెంచా
  • వెల్లులి రెబ్బలు : 5
  • ఇంగువ : చిటికెడు
  • నెయ్యి : 3 చెంచాలు
  • కొత్తిమీర : కొద్దిగా
  • ఉప్పు : రుచికి సరిపడ
  • పసుపు : 1/4 చెంచా

చింత చిగురు పప్పు కూర | How to make chintha chiguru pappu kura Recipe in Telugu

  1. ముందుగా ఒక గ్లాస్ కoదిపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకుని 4 కూతలు వచ్చే వరకు కుక్కర్ లో ఉడికించండి.
  2. తర్వాత మూత తీసి చింత చిగురు, పసుపు, ఉప్పు వేసి మరి కొద్దిసేపు ఉడికించండి.
  3. ఉడికించిన పప్పులో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పాన్ పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర , వెల్లులి రెబ్బలు కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించుకుని ఇంగువ వేసుకోవాలి.
  4. చివరిలో కొత్తిమీర వేసి పప్పు తో కలుపుకోవాలి.
  5. అంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు రెడి. చేసుకొని మీరు కూడా సేవించండి.

నా చిట్కా:

పప్పు మెత్తగా ఉడకటం కోసం చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు.

Reviews for chintha chiguru pappu kura Recipe in Telugu (0)