చామాకు పప్పుకూర | Colacassia leaf curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Colacassia leaf curry recipe in Telugu,చామాకు పప్పుకూర, Sree Vaishnavi
చామాకు పప్పుకూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    14

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

చామాకు పప్పుకూర వంటకం

చామాకు పప్పుకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colacassia leaf curry Recipe in Telugu )

  • చమకూర : 2 కప్పులు
  • పెసరపప్పు : 1 1/2 కప్పు
  • పసుపు : చిటికెడు
  • ఉప్పు : తగినంత
  • ఎండు కారం : 1 చెంచా
  • నూనె : 2 చెంచాలు
  • జీలకర్ర : 1 చెంచా
  • ఆవాలు : 1 చెంచా
  • మినపప్పు : 1 చెంచాలు
  • ఇంగువ : 1/4 చెంచా

చామాకు పప్పుకూర | How to make Colacassia leaf curry Recipe in Telugu

  1. ముందుగా చామకూర ని కడిగి సన్నగా తరుగుకోవాలి. పెసరపప్పు ని శుభ్రoచేసుకొని సరి పడ నీళ్లు పోసి 20 నిమిషాల పాటు ననబెట్టండి.
  2. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర మినపప్పు, ఇంగువ వేసి వేయించాలి
  3. ఇoదులో తరిగి పెట్టుకున్న చామకూర వేసి, పసుపు కూడా వేసి వేయించాలి.
  4. అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి మగ్గనివ్వాలి.
  5. మగ్గిన తరువాత ఉప్పు, కారం వేసి కాసెపు బాగా కలిపి రెండు నిమిషాలు మరల మగ్గనివ్వాలి.
  6. ఎంతో పౌష్ఠికరమైన చామకురా పప్పు రెడి. చేసుకొని ఆ పౌష్టిక విలువలను మీరూ పొందండి.

Reviews for Colacassia leaf curry Recipe in Telugu (0)